Home / Entertainment / నిశ్చితార్థం చేసుకున్న రెజీనా…?

నిశ్చితార్థం చేసుకున్న రెజీనా…?

Author:

తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సమయంలోనే తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రెజీనా కొద్దీ సమయం క్రితం నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని స్వయంగా తానె తెలియజేయడం చెప్పుకోదగిన విషయం. ఈ రోజే తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని ఇక వేగారితో అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తన అభిమానుల సంతోషం కోసం ఎంగేజ్ మెంట్ లో మార్చుకున్న రింగ్స్ ని ఫోటో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా తనకు తన అభిమానుల నుండి ఆశీస్సులు కావాలని కోరింది.

regina-engagement

రెజీనా ఎవరితో ఎంగేజ్ మెంట్ జరిగింది అని అందరూ ఆలోచనలో పడ్డారు. తాను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో మీకు చూపించాలని నాకు ఉంది కానీ దానికి ఇంకా సమయం ఉందని, ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చూపిస్తా అంటూ చెప్పింది. సోషల్ మీడియాలో ఫోటో పెట్టిన కొద్దిసేపటికే తొలగించింది, మరి ఇదంతా నిజం లేక ఏదైనా సినిమా ప్రమోషన్ గురించి ఇలా చేస్తుందా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే !. శివ మనసులో శృతి,రొటీన్ లవ్ స్టోరీ,కొత్త జంట,శంకర,పిల్ల నువ్వు లెనిజీవితం,పవర్,రారా…కృష్ణయ్య. వంటి సినిమాతో అలరించిన ఈ ముద్దగుమ్మ రీసెంట్ గా నక్షత్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

(Visited 136 times, 1 visits today)