Home / Entertainment / మాదాపూర్ లో బట్టలు అమ్మనున్న రేజీన.

మాదాపూర్ లో బట్టలు అమ్మనున్న రేజీన.

Author:

Regina Cassandra Latest Photos

మోహన్ బాబు కుమార్తె గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మి మంచు. తను సినిమాల్లోనే కాకుండ టెలివిజన్ రంగంలో కూడా మంచి కార్యాక్రమాలు(ప్రేమతో మీ లక్ష్మితో, లక్కుంటే లక్ష్మి, దూసుకెళ్తా,బూమ్ బూమ్) సక్సెస్ ఫుల్ గా చేసింది. ఇప్పుడు సామాజిక కార్యాక్రమానికి నడుము ముందడుగు వేసింది, జెమిని టివి వారు సామాజిక శ్రేయస్సు కోసం ఒక ప్రోగ్రం నిర్వహించాడనికి లక్ష్మి ని హోస్ట్ గా తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి అందరికి ఉపయోగాపడేలా ఉండాలనీ ‘మేము సైతం’ అంటు మన ముందుకు వస్తున్నారు.

ఈ కార్యక్రమం భాగంగా లో ఇప్పటికే అక్కినేని అఖిల్ తో ఆటో డ్రైవర్ గా, రకుల్ ప్రీత్ తో కూరగాయలు అమ్మించటం మరియు రానా తో కూలి పని చేయించటం జరిగింది. తాజాగా ట్విట్టర్ లో మంచు లక్ష్మి తను నిర్వహించనున్న మేము సైతం కార్యక్రమం కోసం ప్రముఖ టాలీవుడ్ తార “రెజీనా కాసాండ్రా” మాదాపూర్ దగ్గర ఉన్ననీరూస్ ఎంపోరియోలో రేపు ఆదివారం ఉదయం 9:30 నుండి మద్యానం 12:30 బట్టలు అమ్మనున్నట్లు తెలియజేసింది. రెజీనా కాసాండ్రా అమ్మే బట్టలను కొనాలనుకునే వారు రేపు మాదాపూర్ దగ్గర ఉన్న నీరూస్ ఎంపోరియోకి వెళ్ళొచ్చు, స్టార్ హీరోయిన్ దగ్గర బట్టలు కొన్నట్టు ఉంటది పనిలో పనిగా సమాజ సేవ చేసిన వారు అవుతారు

(Visited 226 times, 1 visits today)