శుక్రవారం ఆమె హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ కవిత జక్కాలతో కలిసి శబరిమల కొండపైకి వెళ్లారు. భారీ సంఖ్యలో పోలీసులు వారిద్దరికీ సెక్యూరిటీ కల్పించారు. ఐతే.. గుడి ప్రధాన పూజారి హెచ్చరికలతో వెనుదిరిగారు. ఈ చర్య ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. రెహానాతోపాటు.. ఆమె కుటుంబాన్ని మతం నుంచి బహిష్కరించాలంటూ… కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్.. ఎర్నాకులం సెంట్రల్ ముస్లిం జమాత్ కు సూచించింది.
ఆ ఆదేశాలను అనుసరించి… రెహానాతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులకు మహల్లు సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు మతాధికారులు ప్రకటించారు.శుక్రవారం నాడు.. నల్లటి దుస్తుల్లో తలపై ఇరుముడి కట్టుకుని అయ్యప్ప భక్తురాలిగా రెహానా శబరిమల కొండపైకి వెళ్లారు. మరో మతం విశ్వాసాలను దెబ్బతీయడం ముస్లిం మతం ప్రకారం తప్పు అని జమాత్ కౌన్సిల్ సభ్యులు అన్నారు.
ఆమె చేసిన చర్య… హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని… హిందూ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని చెప్పారు. 2014లో “కిస్ ఆఫ్ లవ్” నిరసన కార్యక్రమంలో పాల్గొనడం.. ఓ సినిమా కోసం బట్టలు లేకుండా రెహానా ఫాతిమా నటించడాన్ని కూడా కౌన్సిల్ తప్పు పట్టింది.
#Kerala: Journalist Kavitha Jakkal of Hyderabad based Mojo TV and woman activist Rehana Fatima are en-route to the #SabarimalaTemple. pic.twitter.com/IADqXgEJZJ
— ANI (@ANI) October 19, 2018