Home / Entertainment / పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

Author:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వం వహిస్తున్న  ‘కాటమరాయుడు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. శృతి హస్సన్ హీరోయిన్. శరత్ మరార్ ఈ సినిమా కి నిర్మాత, అనుప్ రుబెన్స్ సంగీత దర్శకుడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని చేకూస్తున్నాడు.

release-date-of-pawan-kalyan-trivikram-movie

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది భారీ విజయాలు సాధించాయి. దాంతో ఈ కాంబినేషన్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, పూజ హెగ్డే మెరవనున్నారు. తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఖుష్బూ ని తీసుకున్నారని తెలుస్తుంది.  ఆ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయబోతున్నామని  నిర్మాత ఎస్ రాధాకృష్ణ తెలియజేశారు.

(Visited 478 times, 1 visits today)