Home / Inspiring Stories / బాబా సాహెబ్..! నువ్వే లేకపోతే…..!?

బాబా సాహెబ్..! నువ్వే లేకపోతే…..!?

Author:

ఆనాడు అంబేద్కర్‌ వివక్షాపూరిత హిందూత్వాన్ని కాదని బౌద్ధ మతం స్వీకరించిన దీక్షాభూమిని ఈ నెల 11న మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ సందర్శించారు. ఈ నెల 14న భారత ప్రధాని నరేంద్రమోదీ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జన్మించిన మోవ్‌ గ్రామం సందర్శించబోతున్నారట.కొత్తగా అందరికీ అంబేద్కర్ గుర్తొస్తున్నాడు…. కాదు కాదు అంబేద్కర అవసరం గుర్తొచ్చింది….

Unknown Facts about Ambedkar

ఈ కార్యక్రమాలన్నింటిలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ డాక్టర్‌ అంబేద్కర్‌ను విస్మరించలేకపోవడం, ఆయన సిద్ధాంతాల అవసరం ప్రపంచంలో ముందుకు రావడం వర్తమాన చారిత్రక వాస్తవం. గతంలో డాక్టర్‌ అంబేద్కర్‌ను నిరసించి, అంబేద్కర్‌ను నిరాకరించి, అంబేద్కర్‌ను అపహాస్యం చేసినవారంతా ఈ రోజు ఆయన్ని భుజాలకెత్తుకుని మోస్తున్నారు. ఒక గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన అంబేద్కర్‌ను స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకున్నారు. హిందూ కోడ్‌ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన కృషికి నెహ్రూ ప్రభుత్వం ఆటంకాలు కల్పించటంతో రాజీనామా చేశారు. హిందూ మతంలోని వర్ణవ్యవస్ధ అసమానతలతో, వివక్షలతో కూడి ఉన్నదని, బౌద్దమతం సమాజాన్ని మానవత్వంతో పునర్‌నిర్మించగలదని, బుద్దుడు చెప్పిన దుఃఖం అన్నదానిని నిరుపేదరికంతోనూ, దోపిడితో సమాన అర్థంగా భావించారు. ప్రెవేటు ఆస్తులను రద్దు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆయన భావించారు. అందుకే లక్షలాది మంది తన అనుచరులతో బౌద్దమతం స్వీకరించారు. మనం స్వాతంత్య్రం సాధించుకుని 68 సంవత్సరాలు గడచినప్పటికి, నాడు డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ ఏ వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పొరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాడుతూనే ఉంది. జనాభాలో 70శాతం పైగా వున్న దళితులు, గిరిజనులు, వెనుకబడినతరగతులవారు అనాగరికమైన కులవివక్షతకు గురౌవుతున్నారు. అణిచివేత, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయకార్మికులు, పేద, సన్నకారురైతులు, చేతివృత్తులు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి ఆర్ధిక దోపిడీకి కూడా గురౌతున్నారు. కులపరమైన దోపిడీ వీరి జీవితాలను మరింత దుర్భరం చేసున్నాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిలో భాగస్వాములు కావడం డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయ సాధన కృషిలో భాగం కాగలదు. నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలు సామాజిక న్యాయానికి భంగం కలిగించేవిగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ద్వారా ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అంబేద్కర్‌ కోరుకున్న ప్రణాళికాబద్ద ఆర్ధిక విధానం స్ధానంలో ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, బహుళజాతిసంస్థలు, వాటి ప్రభావంతో పరిశ్రమలను ప్రైవేటురంగం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. కీలకమైన భూసంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు, వ్యవసాయ కార్మికులకు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడంలేదు. దేశాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్న ఇన్సూరెన్స్‌రంగాన్ని, బ్యాంకులను, ఉపాధి కల్పనలో ప్రధాన పాత్ర పొషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్ధలను లాభార్జనే పరమావధిగా గల్గిన ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారు. దేశంలో కుల, మతశక్తులు ప్రజల ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి. సామాజిక న్యాయానికి, దేశసమైక్యతకు నష్టం కలిగించే విధంగా పాలకవర్గాలు విధానాలను రూపొందిస్తున్నారు. ఈ నేపద్యంలోనే డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ బోధనలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి…. మరి ఒక వేళ ఆ అంబేద్కర్ లేకుంటే ఏమయ్యేదీ…? ఒక్క సారి తలుచుకుంటే……..

Unknown Facts about Ambedkar

బాబా..! నిజమేనేమో నువ్వే లేకపోతే మాకు పోరాటం అంటే తెలిసేది కాదు..అధికారం చేతులు మారినప్పుడు స్వతంత్రం వచ్చిందంటే అదిమాకు కాదు అన్న సత్యాన్ని ఆనాడే చెప్పిన నువ్వే లేకపోతే ఇప్పటికీ మాకు స్వతంత్ర పోరాటం అన్న మాటే తెలిసేది కాదు. అగ్రవర్ణ స్వాతంత్రం ఇంకా మానెత్తిన ఊరేగుతూనే ఉండేది…
వివక్షత అనేది స్వాతంత్ర్యం లేకపోవడానికి మరోపేరు”
స్వాతంత్ర్యం ఉపయోగపడనప్పుడు స్వతంత్రం రానట్టే లెక్క” అంటూ నువ్వు చెప్పిన మాటలే లేకపోతే వెలివాడల బతుకులకింకా ఒక్కటంటే ఒక్క ఉదయం కూడా ఉండేది కాదు.,నిజానికి ఈనాటికీ విశ్వవిద్యాలయ స్థాయిలో, ఆధునిక భారతీయ తత్వశాస్త్ర పాఠ్యాంశాల్లో నువ్వెక్కడా?. కమ్యూనిస్టులు కూడా తమ రాజకీయ పాఠశాలల్లో అంబేద్కర్‌ అంటే ఒక బూర్జువా మేధావి అంటూ అంటూ దూరం పెట్టిన రోజునా నీకోసం అడిగినోడెవ్వడు?

Unknown Facts about Ambedkar

ఇక ఆరెస్సెస్ నిన్నూ నీ భావజాలాన్ని హైందవీకరించాలని నిన్నూ ఒక “హిందువుని” చేయాలని చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భీం రావ్ వద్దు..వద్దు..నిన్ను దూరం చ్గేసుకోలేం ఏ కుహనా మతాలకూ నిన్నప్పగించం. అస్పృశ్య జాతులకు ఎంత చరిత్ర వుందో, అస్పృశ్యులుగా చెప్పబడుతున్న వారి తాత్విక భావాల నిరాకరణకు కూడా అంతే చరిత్ర ఉంది. ఒక మనిషి చెప్పిన భావాలు, ఆలోచనలు సామాజిక పరిణామానికి ఎంతవరకు మూలభూతం అవుతాయో చూడకుండా, ఇంకా నిన్నొక కులంగానే నీ కులపు ఓట్లకు నిన్నొక మార్గంగానే కదా చూస్తున్నారూ..

Unknown Facts about Ambedkar

నీ అధ్యయనం, అవగాహన ఈ హిందూ సమాజానికే కదా ఒక నాడు గుండెల్లో దడ పుట్టించిందీ..1916లో 24 ఏళ్ల యువమేధావిగా ‘క్యాస్ట్స్‌ ఇన్‌ ఇండియా, ధైర్‌ మెకానిజం, జెనిసిస్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌’ అనే పరిశోధనాత్మక పత్రాన్ని డాక్టర్‌ గోల్డెన్‌ విజర్‌ మానవశాస్త్ర సెమినార్‌లో సమర్పించి నువ్వొక సిద్దాంత సిద్ధాంతకర్తగా అవతరించాకే కదా ఈ పెద్ద వాళ్ళ ఇళ్ళు నీ వెలివాడ ముందుకు తమ గడపల్ని తెచ్చాయి. వద్దు భీం రావ్ వద్దు నీ పాలాభిషేకాలు చేస్తూ హిందువైజ్ చేసే ఆ మనువులవపుకి కన్నెత్తయినా మమ్మల్ని చూడనియ్యకు…

Unknown Facts about Ambedkar

హిందూవాదులు, మనుస్మృతి కర్తలు చెప్తున్న చాతుర్వర్ణాల సంకరం నుంచి పంచమవర్ణం ఆవిర్భవించిందనే సిద్దాంతాలన్నీ నిన్ను చూసి తోకముడిచినట్టే. పంచములం ప్రగతికి ఇంకాస్త దూరం గానే ఉన్నాం. నిన్నామ్మొన్నా కళ్ళలో కుళ్ళునింకున్న వాళ్ళంతా పూలదండలతో నీ ముందుకొస్తారు… నువ్వే లేకపోతే మాకోసం వీల్లొక వలని వెతుక్కోవటానికి ఇంకెన్ని వేశాలాడేటోల్లో కదా…! నువ్వే ఉండు ఈ మోసగాళ్ళనుంచి మమ్మల్ని కాపాడుతూ ఉండూ… ఓ తిరస్కృతుడా..భహిష్కృతుడా…మాలోడా..మా మాదిగోడా…మహరుడా..బహుజనుడా… నువ్వే ఉండు మాతోనే ఉండు…..

(Visited 418 times, 1 visits today)