Home / Inspiring Stories / 1971 అమరజవాన్లకు మన బహుమానం ఏమిటి?

1971 అమరజవాన్లకు మన బహుమానం ఏమిటి?

Author:

1971 indo pak war

ఇవాళ డిసెంబర్ 16 భారత దేశం గర్వంగా తలెత్తుకుని గర్వపడ్డ రోజూ ఇదే, దాదాపు 4000 మంది భారత వీర సైనికులను కోల్పోయి కన్నీళ్ళు కార్చిన రోజూ ఇదే… ఐతే ఈ రోజు ఇప్పుడు మనలో ఎందరికి గుర్తుంది? ఆవుకోసం,గుడి కోసం కోట్టుకునే పరిస్థితుల్లో మనదేశమంటూ మిగలటానికి తమ ప్రాణాలిచ్చిన ఆ సైనికుల త్యాగం ఎందరికి గుర్తుంది??

1971 indo pak war

1971_war_captured_pak_tank_Indian_troops

1971 డిసెంబర్ 3 ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) కి చెందిన , వాయువ్య భారతదేశపు పదకొండు వాయుసేనా స్థావరాల మీద అనుమాన ప్రేరిత దాడులు మొదలు పెట్టింది. అప్పటి వరకూ పాక్-బంగ్లా విషయంలో జరుగుతున్న యుద్దం ఇండో పాక్ యుద్దంగా మారింది పొరుగు దేశం రెండో సారి భారత దేశం పై దాడులకు తెగబడింది.. అసలీ యుద్దానికి మూల కారణం బంగ్లాదేశ్ విముక్తి, అప్పట్లో పాక్-బంగ్లాలను తూర్పు పశ్చిమ పాకిస్తాన్ లుగా పిలిచేవాళ్ళు, 1970లో పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలతో ఈ రగడ మొదలైంది. ఈ ఎన్నికలలో “తూర్పు పాకిస్తానీ అవామీ లీగ్” తూర్పు పాకిస్తాన్‌లో, 169 సీట్లలో 167 సీట్లు గెలుచుకుని 313 సీట్లు గల మజ్లిస్-ఎ-షూరా (పాకిస్తాన్ యొక్క పార్లమెంట్) లో స్వల్ప ఆధిక్యతను పొందింది. అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజీబుర్ రహ్మాన్ పాకిస్తాన్ రాష్ట్రపతికి ఆరు సూత్రాలను సమర్పించి ప్రభుత్వం స్థాపించే హక్కుని కోరాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో, పాకిస్తాన్ ప్రభుత్వం పై అధికారాన్ని ముజీబుర్‌కు బదిలీ చేయడానికి నిరాకరించడంతో, రాష్ట్రపతి యాహ్యా ఖాన్ పశ్చిమ పాకిస్తానీల ఆధిఖ్యతలో ఉన్న సైన్యాన్ని నిరసనను అణచివేయడానికి పిలిచాడు. దేశమంతా అల్లకల్లోలం పాకిస్తాన్ సైన్యంలో మేజర్ అయిన జియా ఉర్ రెహ్మాన్ తనకు తానుగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాడు. అవామీ లీగ్ నాయకులు కొందరు కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొనగా ప్రజలే గెరిల్లా గ్రూపులుగా మారి తమకున్న ఆర్మీతో కలసి పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్దమయ్యారు. అదే సమయంలో భారత ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్లో ఉన్న హిందూ, బెంగాలీల కోసం సరిహద్దులు తెరిచి శరణార్థులను భారత్లోకి వచ్చే ఏర్పాటు చేసారు..

indira_gandhi

భారత దేశంలో అభద్రతా పరిస్థితులు సృష్టించటానికే ముందుండే అమెరికా పాకిస్తాన్ కు మొదటి నుండి సహాయం చేస్తూనే ఉంది ఈ యుద్దం లోకూడా పాకిస్తాన్ కు అవసరమయిన ఆయుధాలు మరియు సామగ్రి సమకూర్చడానికి సిద్ధమయింది. వెంటనే ఇందిరా గాంధీ యూరప్ పర్యటన జరిపి యునైటెడ్ కింగ్‌డమ్,ఫ్రాన్స్ లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉండేలా,ఇంకా సోవియట్ యూనియన్‌తో ఇరవయ్యేళ్ళ మైత్రీ ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఐతే ఇక్కడ బంగ్లాదెశ్ కి భారత్ సపోర్ట్ ఇష్టం లేని మరో దేశం చైనా… పాకిస్తాన్ కి చైనా కూడా రహస్యంగా ఆయుధాలిచ్చింది.. ఈ రెండు దేశాల అండ చూసుకొని రెచ్చిపోయిన పాక్ భారత దేశంతో తలపడటానికి సిద్దమైంది…

1971 indo pak war photos

పదిహేను రోజుల పాటు రెండు దేశాల త్రివిధ దళాలూ పోటీపడ్డాయి అమెరికా వెన్ను దన్ను గా ఉన్న పాక్ విజయం తమదే అంటూ బీరాలు పలికింది… అంతర్జాతీయ ప్రసారమాధ్యమాలు కూడా అలాంటి వార్తలనే ప్రసారం చేసాయ్ కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారత నావికా దళం కరాచీ పోర్టు పైన మెరుపుదాడి చేసి యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. బంగాళాఖాత జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో వైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫొర్స్‌ను ధ్వంసం చేసింది. భారత సైన్యం ముందు నిలువలేక పాకిస్తాన్ కేవలం 15 రోజుల్లో, అంటే డిసెంబర్ 16 న లొంగిపోయింది. మరుసటి రోజు భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యాధిపతి ఎ.ఎ.కె. నియాజి తన సైన్యంతో బాటు భారత్ సైన్యాధిపతి జగ్జీత్ సింగ్ అరోరాకి లొంగిపోతున్నట్టు అధికారిక పత్రం రాసి మరీ ఇచ్చాడు. భారత సైనికుల ఆనందానికి అంతే లేదు… ఐతే 3,843మంది వీరులని కోల్పోయింది భారత మాత.మరో 9,851మంది గాయపడి విధులకి దూరమయ్యారు…కానీ గుండెలు అదిరే దెబ్బ ప్రపంచానికి చూపి భారత్ సత్తా ఏమిటో చూపించారు…. జై జవాన్.

1971_surrender

1971 indo pak war 3

(Visited 234 times, 1 visits today)