Home / Entertainment / రేపే విడుదల కానున్న బ్రూస్ లీ, చిరు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.

రేపే విడుదల కానున్న బ్రూస్ లీ, చిరు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.

Author:

బ్రూస్ లీ తెలుగు సినిమాలో ఒక సరికొత్త సంచలనం గా వస్తున్న సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ ఏ’ సర్టిఫికేట్ అందుకొని అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ప్రస్తుతం అన్ని ఏరియాలకు వెళ్ళాల్సిన ప్రింట్స్ డిస్పాచ్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే రన్ టైమ్ ని కూడా లాక్ చేసేసారు దీంతో మొదట్లో వచ్చే యాంటీ స్మోకింగ్ యాడ్ తో కలుపుకొని మొత్తం సినిమా నిడివి 146 నిమిషాలు ఉండగా. ఈ మొత్తం లెంగ్త్ లో మెగా స్టార్ కనిపించే ది 5 నిమిషాల పాటు మాత్రమే. ఐతే సినిమా మొత్తం ఒక ఎత్తైతే చిరు ఎపిసోడ్ ఒకటీ ఒకెత్తు అన్నంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు..

సెన్సార్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా సూపర్ హిట్ ఖాయమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే సినిమాని అద్బుతంగా మార్చిందట. ఫస్టాఫ్ అంతా కోన వెంకట్ కామెడీ తో సాగే సినిమా ఇంటర్వెల్ నుంచీ రొమాన్స్, ఫైట్స్ తో థ్రిల్లింగ్ గా ఉంటుందట.రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఆడియోకి మంచి రెస్పాన్సే ఉంది డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రాంచరణ్ తో సహా చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా విడుదల క్షణాల కోసం అభిమనుల తో సమానం గా ఉత్కంట తో ఎదురు చూస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా రాం చరణ్ కెరీర్ లో మరో మగధీర అవాలని కోరుకుంటున్నాడు రాం చరణ్… మరి రాం అభిలాష నెరవేరాలనే మనమూ కోరుకుందా..

(Visited 37 times, 1 visits today)