Home / health / డెంగీ జ్వరం లక్షణాలు, చికిత్స మరియు నివారణ మార్గాలు.

డెంగీ జ్వరం లక్షణాలు, చికిత్స మరియు నివారణ మార్గాలు.

Author:

ఇప్పుడు  తెలుగు రాష్ట్రాలను  అతిగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం డెంగీ జ్వరం. ఈ డెంగీ తో చాలా మంది తీవ్రమైన భాధను అనుభవిస్తున్నారు. కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతున్నారు. దీని నివారణకు వైద్యులు చాలా సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో అపరిశుభ్ర పరిసరలాలలో ఉండే దోమలు కుట్టడం వలన డెంగీ జ్వరం వ్యాప్తిస్తుంది.

dengue-fever

డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చదివి తెలుసుకోండి :

  • విపరీతమైన జ్వరం
  • చలి, తీవ్రమైన తల నొప్పి, ఒళ్లునొప్పులు
  • శరీరంపై దద్దుర్లు రావడం
  • విపరీతమైన దాహం వేయడం,  నోరు ఎక్కువగా ఆరిపోతుంది
  • వాంతులు అవడం
  • కళ్లలో  నొప్పి రావడం.

డెంగీ జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలు:

  • జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. పరీక్షలు చేయించకుండా మామూలు జ్వరానికి వాడే యాస్ప్రిన్, బ్రఊఫిన్ మాత్రలు వాడకూడదు.
  • జ్వరం వచ్చిన వెంటనే చల్లని నీళ్లతో శరీరాన్ని ఒక గుడ్డతో బాగా తుడవాలి. ఎక్కువగా జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. అలాగే జ్వరం నుండి ఉపశమనం కొరకు పారాసెట్మాల్ మాత్రను మాత్రమే  వెయ్యాలి.
  • డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది.  ఇలాంటి సమయంలో నొప్పుల ఎక్కువగా ఉన్నాయి అని ఎన్ఎస్ ఏఐడి ఉన్న మాత్రలు వాడకూడదు.
  • ఒకవేల ఫ్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫ్లేట్ లెట్స్ ఎక్కించాలి.
  • డెంగీ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి.
  • క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగించాలి.
  • బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి మిక్సీ లో రుబ్బాలి. తరవాత వచ్చఇన మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాస్ చొప్పున బాధితునికి తాగించాలి. ఇలా చేయడం వలన రోగి తొందరగా కోలుకోవడమే కాదు డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.

డెంగీ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు:

  • పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారించాలి. కాయిల్స్, లిక్విడ్ లాంటివి వాడాలి. దోమ తెరలను వాడితే ఇంకా మంచింది.
  • నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి  ఒక్కొక్క భాగంలో 10-15 లవంగాలు అందులో గుచ్చాలి. దీని వలన డెంగీ దోమలు ఆ పరిసరప్రాంతంలోకి రావు.
  • రాత్రి సమయంలో కొబ్బరి నూనె పాదాలకు నుంచి మోకాళ్ళ దాకా బాగా రాసుకోవాలి. ఇలా చేయుటం వలన డెంగీ దోమ దగ్గరికి రాదు ఎందుకంటే కొబ్బరి న నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది.
(Visited 3,554 times, 1 visits today)