Home / Uncategorized / ఎన్నికల ముందు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తన్నారు…ఇప్పుడెలా కవర్ చేసుకున్నారో తెలుసా.?

ఎన్నికల ముందు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తన్నారు…ఇప్పుడెలా కవర్ చేసుకున్నారో తెలుసా.?

Author:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఎంత ఓవర్ చేసారో కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. సోషల్ మీడియాలో ఆ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి పెద్ద బొక్క పడింది. కేసీఆర్ దెబ్బకి సరిగ్గా ఇరవై సీట్లు కూడా దక్కలేదు. మరి ఇప్పుడు బండ్ల గణేష్ ఏమయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వస్తున్నాయి. అదే విధంగా రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ రెడ్డిపై కూడా ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ వస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రముఖులు సైతం ఓడిపోబోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన పై విధంగా సవాల్ విసిరారు.

టీఆర్ఎస్ పార్టీ ఏమైనా గోల్‌మాల్ చేసి ఎన్నికల్లో గెలిచిందా? అక్రమాలకు పాల్పడిందా? అన్నది పార్టీతో చర్చించిన తరువాత మాట్లాడతాం. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్‌‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండి, ప్రజల తరుపున పోరాటం చేస్తాం. గెలిస్తే.. మా మీద ఒకమైన బాధ్యత ఉండేది. ప్రతిపక్షంలో ఉంటే మా బాధ్యత ఇంకా పెరిగింది. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే ఉప్పొంగిపోయే లక్షణం కాంగ్రెస్‌కు లేదు. 1956 నుండి జరిగిన ఎన్నికల్లో చాలా ఏళ్లు అధికారంలో ఉంది. 1956 నుంచి అనేక సార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటంబ పాలనకు పట్టం కట్టినట్లు, రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు ఇచ్చిన లైసెన్స్‌ కాదని సూచించారు.

రేవంత్ revanth reddy vote for note

ఇప్పటికైనా కేసీఆర్‌ తన వ్యవహారి శైలిని మార్చుకొని.. ఫామ్‌హౌస్‌ నుంచి కాకుండా.. ప్రజల మధ్య ఉండి పాలన చేయాలని సూచించారు. తక్షణమే తెలంగాణ అమరవీరులను గుర్తించి ఆదుకోవాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా, విద్యార్థులకు మంచి విద్యను అందించేలా పాలన చేయాలని సూచించారు.

watch video:

ఈ విషయం రేవంత్ దాకా రావడంతో ఆయన స్పందించారు. ‘‘ తన సవాల్‌పై కేటీఆర్ స్పందించలేదని… ఆయన స్పందనపైనే నా నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని…ప్రజల కోసమే ఉన్నానని.. ప్రజలతోనే ఉంటానని రేవంత్ స్పష్టం చేశారు.

(Visited 1 times, 1 visits today)