Home / Entertainment / రామ్ గోపాల్ వర్మ 340 కోట్లతో ఇంటర్నేషనల్ సినిమా.

రామ్ గోపాల్ వర్మ 340 కోట్లతో ఇంటర్నేషనల్ సినిమా.

Author:

రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అది సెన్సేషన్ అవుతుంది లేదా వివాదంగా మారుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్ లేక వెనకబడిన తన ట్యాలెంట్ ని మాత్రం ఎవరు తక్కువ అంచనా వెయ్యలేరు. తమదైన రోజు ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగల దర్శకుడు వర్మ. ఇక ఇప్పుడు అలాంటి సమయమే వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తానూ ఒక ఇంటర్నేషనల్ మూవీ చేయబోతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు వర్మ.

ram-gopal-varma-new-film

న్యూక్లియర్ అనే సినిమాను 340 కోట్లతో నా మొదటి ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నా.. ఈ సినిమాలో అమెరికా, చైనా, రష్యా, యెమెన్ లతో పాటు ఇండియాలో కూడా తీస్తాం. ఈ సినిమాలో అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ యాక్టర్స్ ఉంటారు. నా కంపెనీతో గత 15 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న సీఎంఏ గ్లోబల్ ఈ సినిమాను నిర్మించనుంది అని వర్మ తెలిపాడు. వర్మ ఈ సినిమా గురించి అనౌన్స్ రోజునే తన సినిమా స్టోరీని ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఇలా హాలీవుడ్ లో మాత్రమే చెబుతారు…. ” ముంబైకి ఆటమిక్ స్మగుల్ చేయబడుతుంది. కాశ్మీర్ ను ఖాళీ చేయాలనే డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటే, ఆ సమయంలో అమెరికా రంగంలోకి దిగుతుంది. అన్ని రకాల సైన్యాన్ని మోహరించడానికి ఇండియా, పాక్ లను అమెరికా ఒప్పిస్తుంది. కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. అదే మూడవ ప్రపంచ యుద్దానికి నాంది’…. అదే ఈ న్యూక్లియా కి సినాప్సిస్”… అంటూ తన ట్విటర్ లో పోస్టే చేశాడు.

తానూ తీసిన చాలా సినిమాలు అనౌన్స్ చేసి ఆగిపోయినవి ఉన్నాయి. షూట్ చేసి రిలీజ్ కానివి ఉన్నాయి. మరి ఈ సినిమా అయినా ఎలా ఉంటుందో మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది….

(Visited 220 times, 1 visits today)