Home / Entertainment / నవంబర్ 20 న రోబో 2.0 లోగో ఫస్ట్ లుక్ విడుదల.

నవంబర్ 20 న రోబో 2.0 లోగో ఫస్ట్ లుక్ విడుదల.

Author:

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో రోబో సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా చరిథ్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘2.0’ టైటిల్ ని అన్ని భాషలకు పెట్టారు. ఈ సినిమా లోగో, ఫస్ట్ లుక్ లను నవంబర్ 20 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర టీమ్…

rajni2_0-first-look-on-20th-november

2.0 ఫస్ట్ లుక్ ని బాలీవుడ్ ప్రఖ్యాత యష్ రాజ్ స్టూడియోలో విడుదల చేయనున్నారు. నవంబర్ 20 న సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ వేడుకలో చిత్ర టీమ్ తో పాటు పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా తను హాజరు అవుతున్నట్టు దర్శక, నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా ప్రకటించాడు. ఈ సినిమాలో రజని సరసన అమీ జాక్సన్ నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

(Visited 87 times, 1 visits today)