Home / Inspiring Stories / అసలు అసెంబ్లీలో రోజా ఏం మాట్లాడారో వినండి.

అసలు అసెంబ్లీలో రోజా ఏం మాట్లాడారో వినండి.

Author:

roja cooments in Assembly

రోజా ఏడాది పాటు సస్పెన్షన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూజువాణి ఓటుతో ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినట్లు చేసారు. అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ, అన్‌పార్లమెంటరీ భాషను మాట్లాడారంటూ. రోజాను ఏడాదిపాటు సభకు రాకుండా సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు.

ఆయన ప్రతిపాదించిన మరు క్షణమే స్పీకర్ కోడెల రోజాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరూ రోజా సస్పెన్షన్ ఏకపక్ష నిర్ణయమని, దారుణమని స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వడానికి స్పీకర్ నిరాకరించారు. తన ఆదేశాలే తుది నిర్ణయమని, సస్పెండ్ అయిన శాసనసభ్యురాలు బయటకు వెళితేనే మాట్లాడేందుకు అవకాశమిస్తానని స్పీకర్ తెగేసి చెప్పారు. ఒక దశలో స్పీకరే ఇరు పార్టీల సభ్యులు ఎవరైనా అసభ్యకర పదాలు వాడితే వాటిని రికార్డుల్లోంచి తొలగిస్తామని చెప్పారు.ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యేంత తప్పు రోజా చేయలేదని పార్టీ అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ సభ్యులు చెబుతున్నారు. అయితే, రోజా చేసిన వ్యాఖ్యలకు ఏడాది కాదు. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకుండా వేటు వేయాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అసలు రోజా ఎంత దారుణ వ్యాఖ్యలు చేశారనే దానిపై చర్చ సాగుతోంది. ఆరోజు జరిగిన చర్చల్లో రోజా ప్రవర్తన,ఆవిడ వాడిన అసభ్య పదజాలాన్నీ మరోసారి రికార్డుల్లో చూసాక ఎవరేమంటారో చూడాలి.

ఎందుకంటే రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని బిజెపి శాసన సభ్యుడు విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సభలోనే తప్పుబట్టారు. అయితే తరువాత సభ రికార్డులు చూసిన వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. రోజా చేసిన వ్యాఖ్యలకు ఏడాది సస్పెన్షన్ వేటు సబబేనని, ఆమె అంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారని తొలుత తనకు తెలియదని చెప్పారు. అసలింతకీ రోజా ఏమన్నారు? ఎంతటి వివాదాస్పద ప్రవర్తన కాకపోతే ఆమెని ఏడాది పాటు సస్పెండ్ చేసారు?? ఒక సారి ఈ వీడియో చూడండి.. ఐతే ఈ వీడియోలో రోజా వాడిన మాటలు సంస్కార వంతులకు కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు.

,

(Visited 8,398 times, 1 visits today)