Home / Entertainment / రోజులు మారాయి సినిమా రివ్యూ & రేటింగ్.

రోజులు మారాయి సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

రోజులు మారాయి రివ్యూ రేటింగ్ Rojulu-Marayi-Movie-Review-Perfect-Review-Rating

నటీనటులు: పార్వతీశం – చేతన్ – తేజస్వి మదివాడ – కృతిక జయకుమార్ – ఆలీ – వాసు ఇంటూరి తదితరులు
సంగీతం: జె.బి
నిర్మాత: జి.శ్రీనివాసరావు
కథ – స్క్రీన్ ప్లే: మారుతి
దర్శకత్వం: మురళీకృష్ణ ముదిదాని

ఒక వైపు తను దర్శకత్వం వహిస్తున్న సినిమాలతో విజయాలను సాధిస్తూ మరో పక్క చిన్న సినిమాలను నిర్మిస్తూ వాటిలో కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న దర్శక,నిర్మాత మారుతి కథ అందించిన సినిమా రోజులు మారాయి. ఈ సినిమాకు దిల్ రాజు కూడా సహా నిర్మాత, అలాగే సమర్పకుడిగా ఉన్నాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం ….

కథ :

ఒకే హస్ట‌ల్లో ఉంటూ ఆద్య (కృతిక), రంభ (తేజస్వి) లు ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గ‌డిపేస్తుంటారు. ఈ ఇద్ద‌రిపై అశ్వ‌ద్(చేత‌న్), పీట‌ర్(పార్వ‌తీశం) లు మ‌న‌సు పారేసుకుంటారు..అయితే అమ్మాయిలిద్ద‌రికి ఎవ‌రి సెట‌ప్ లు వారికుంటాయి.. ఆద్య‌, రంభ‌లు అప్ప‌డ‌ప్పుడు త‌మ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు ఈ ఇద్ద‌రి అబ్బాయిల స‌హ‌కారం పొందుతుంటారు.. విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో ఈ ఇద్ద‌రు హీరోయిన్ ల‌కు ఒక నిజం తెలుస్తుంది.. తాము ఎవ‌రినైతే పెళ్లి చేసుకుంటామో వారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ని.. ఈ గండం నుంచి బ‌య‌ట పడేందుకు ఆద్య, అశ్వద్‌ను, రంభ, పీటర్‌ను పెళ్ళాడతారు. ఆ త‌ర్వాత ఏమైంద‌నేడి మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

మంచి క‌థ‌నే మారుతీ అందించాడు..ఈ సినిమాకు ఎంచుకున్న కథాంశం, దాని నేపథ్యం సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అంటే.. అందులో కామెడీ, లవ్ వంటి అంశాలు ఎక్కువగా కోరుకుంటారు. అలాంటివి ఈ మూవీలో బాగానే ఉన్నాయి. ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఆద్యంతం నవ్వించే కామెడీతో చాలా ఎంటర్టైనింగ్‌గా సాగిపోతుంది. ఫస్టాఫ్‌లోని ఈ కామెడీని సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. టైటిల్స్ దగ్గర్నుంచే కథలోకి తీసుకెళ్ళే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. మధ్యలో ఎక్కడా బోర్ లేకుండా సరాదాగా సినిమా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్ గురించి మాట్లాడుకుంటే.. మొత్తం రొటీన్‌గా మారిపోయింది. ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎగ్జైటింగ్ అంశాలేవీ సెకండాఫ్‌లో అంతగా లేవు. ఏదో కథను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో మధ్యలో కొన్ని అనవసరమైన ఎపిసోడ్‌లను యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. నటీనటుల్లో పార్వతీశం నటన చాలా హైలైట్. తన కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు.అలాగే రంభ పాత్రలో తేజస్వి కూడా చాలా మంచి మార్కులను కొట్టేసింది. తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని కట్టిపడేసింది. ఇక చేతన్ అమాయకమైన పాత్రలో తన పారింది మేరకు తను నటించాడు. ఇందులో నాలుగవ పాత్ర చేసిన కృతిక పాత్ర చాలా బాగా ఈ సినిమాకు హెల్ప్ అయింది. ఒకేసారి రెండు కోణాల్లోనూ ఆలోచించే ఈ పాత్రలో తన నటనను చూపించే పాత్ర దొరకడం నిజంగా తన అదృష్టం.

సాంకేతిక వర్గం పనితీరు:

మారుతి అందించిన స్ర్కీన్‌ప్లే ఫ‌స్టాఫ్‌లో ఉన్నంత మజా సెకండాఫ్‌లో లేదు.ద‌ర్శ‌కుడిగా ముర‌ళీ కూడా ఫ‌స్టాఫ్‌ను బాగా తెర‌కెక్కించ‌డంతో పాటు ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఓ డైరెక్ట‌ర్‌గా తానేంటో రుజువు చేసుకున్నాడు. సెకండాఫ్‌లో ఏ ఒక్క సీన్ కూడా మెచ్చుకోద‌గిన‌ట్టుగా లేదు. మారుతి స్ర్కీన్‌ప్లే సైతం ప‌ర‌మ‌రొటీన్‌గా ఉండ‌డంతో ద‌ర్శ‌కుడు సైతం ఏం చేయ‌లేక చేతులెత్తేశాడు. క్లైమాక్స్ పాత సినిమాల్లో రొటీన్ డ్రామాల‌ను త‌ల‌పించేసింది. జేబీ సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ, మాట‌లు, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • ఫస్టాప్
  • పార్వతీశం, తేజస్వి
  • సంగీతం

మైనస్ పాయింట్స్:

  • కథ
  • పరమ చెత్తగా సెకండాఫ్
  • మారుతి రొటీన్ కైమాక్స్
  • ఇక మారుతి అంటేనే బూతు డైలాగ్స్

అలజడి రేటింగ్: 2.25/5

పంచ్ లైన్: రోజులు మారాయి..కానీ కథ మాత్రం మారలేదు..!

(Visited 3,716 times, 1 visits today)