Home / Inspiring Stories / ఒకానొక కాలంలో ఒక రూపాయి కంటే డాలర్ విలువ తక్కువగ ఉండేదన్న విషయం తెలుసా?

ఒకానొక కాలంలో ఒక రూపాయి కంటే డాలర్ విలువ తక్కువగ ఉండేదన్న విషయం తెలుసా?

Author:

భారత దేశంలో ఒకప్పుదు నాణెం అంటే బంగారు నాణెమే. సరుకులను కొనటానికి ఇప్పుడు మనం రూపాయి ఒక రూపాయీ,యాబై,వందా ఇలా వాడినట్టే ఒకప్పుడు రాగి, వెండి, బంగారు నాణేలను వాడిన భారత దేశం ఇప్పుడు. అంతర్జాతీయ విపణిలో ఎంత గా జారిపోయిందో చూస్తూనే ఉన్నాం. సంస్కృత పదమైన రూప్యకం (అనగా “వెండి నాణెం”) నుండి రూపాయి అనే పదం వచ్చిందంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాను భారత రూపాయినే వాడేది దానిపై పాకిస్తాన్ గవర్నమెంట్ అనే ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, కతర్, యు.ఎ.ఇ, మలేసియా లలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు.

కానీ కాలం మారింది ఒకప్పటి రత్న గర్భ ఇప్పుడు పేదదైపోతోంది. ఇప్పుడు డాలర్ ని అందుకోవటానికి తంటాలు పడుతోన్న రూపాయి ఒకప్పుడు తనదైన చరిత్రని కలిగి ఉంది. ఒకానొక కాలంలో ఒక రూపాయి కంటే డాలర్ విలువ తక్కువగ ఉండేది. స్వాతంత్ర్యానంతరం మనదేశ రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది.

1947 లో రూపాయీ ఒక డాలర్ కి సరి సమానం గా ఉండేది,1917 లో డాలర్ కన్నా మన రూపాయికే విలువ ఎక్కువ. అప్పుడు 1 రూపాయి 13 డాలర్లతో సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక డాలర్ విలువ 67 రూపాయలు. కాలంతో పాటే మన రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతూ వచ్చింది.అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కో ఏడాదీ గడిచే కొద్దీ మన రూపాయి ఎంత బక్క చిక్కి పోయిందో చూడండి..

Rupee 1

Rupee 2

Rupee 3

Rupee 4

(Visited 2,804 times, 1 visits today)