Home / Inspiring Stories / ఒక్క గుద్దుతో పేషెంట్ ని చంపేసిన బాక్సర్ డాక్టర్.

ఒక్క గుద్దుతో పేషెంట్ ని చంపేసిన బాక్సర్ డాక్టర్.

Author:

చికిత్స కోసం వచ్చిన రోగి తన మానసిక రోగాన్నీ బయట పెట్తుకొని ప్రాణాలు మీదకి తెచ్చుకున్నాడు.నర్స్ తో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి హాసిపిటల్ లోని డాక్టర్ చేతిలోనే చావు కొనితెచ్చుకున్నాడు.ఇంతకీ ఆ డాక్టర్ రోగి ప్రాణాలను తీసింది తన అసమర్ధతతోనో లేక నిర్లక్ష్యంతోనో కాదు. హాస్పిటల్ లోని నర్స్ తో పిచ్చివేశాలేసినందుకు. రోగిని సింగిల్ పంచ్ ఇచ్చి వైద్యుడు ప్రాణాలు తీశాడు. ఈ దాడి వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాకు చిక్కింది. ఇపుడు ఈ వీడియో రష్యా మీడియాలోనే కాకుండా యూట్యూబ్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నది. డాక్టర్ ఇయా జెలెందినోవ్‌ను ది బాక్సర్ డాక్టర్ అని మీడియా పేర్కొంటున్నది.

వీడియోలో కనిపించిన ప్రకారం.. గదిలోకి డాక్టర్ వెంట వచ్చిన నర్సు “ఇతనే” అంటూ అక్కడ ఉన్న వ్యక్తిని చూపించటం “నర్సును ఎందుకు పట్టుకొన్నావు?” అంటూ దవాఖానలోని పడకపై ఉన్న రోగి యెవ్‌జెనీ బక్తిన్‌ను లేపి దృఢంగా ఉన్న డాక్టర్ ఒక్క తోపు తోశాడు.వెంటనే ముందుకు రావడంతో ముఖంపై బలంగా మొహమ్మీద ఒకేఒక్క గుద్దు గుద్దాడు. దాంతో ఆ పేషెట్ వెంటనే నేలపై పడిపోయాడు. పేషంట్ చర్యని సమర్థిస్తూ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన రోగి బంధువుని కూడా చితక్కొట్టాడు. నిమిషం తర్వాత కూడా రోగి నేలపై చలనం లేకుండా పడి ఉండటంతో వైద్య విద్యార్థులు స్పందించి. నేలమీద పడి ఉన్న మనిషిని బతికించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అతను మృతి చెందడంతో వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ ఘటన రష్యాలోని బెల్‌గోరోడ్‌లో డిసెంబర్ 29న జరిగిందని దర్యాప్తు కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో వైద్యుడికి రెండేండ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.ఐతే నర్స్ ని లైంగికంగా వేదించీ,దూషించినందుకే ఆ డాక్టర్ అలా ప్రవర్థించాడు. కాబట్టి మరీ పెద్ద శిక్షేమీ పడక పోవచ్చు.

(Visited 382 times, 1 visits today)