Home / Entertainment / మళ్ళీ మన అందరిని ‘ఖుషి’ చేయనున్న పవర్ స్టార్.

మళ్ళీ మన అందరిని ‘ఖుషి’ చేయనున్న పవర్ స్టార్.

Author:

kushi 2 Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజ్ ఉన్న స్టార్ హీరో, తన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబందం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. 2001లో తమిళ డైరెక్టర్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా లవ్ అండ్ పామిలీ ఎంటర్ టైనర్. పాటలూ, కామెడీ పరంగా కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఓ వార్త ఏమిటంటే !? త్వరలో ఖుషి సీక్వెల్ (ఖుషి 2) చేయబోతున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ మధ్య ముంబై వెళ్లిన డైరెక్టర్ ఎస్.జె. సూర్యని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నిర్మాత, నటి రేణుదేశాయ్ లంచ్‌కి ఆహ్వానించింది వున్నట్లుండి డైరెక్టర్ సూర్యతో రేణు ఎందుకు భేటీ అయ్యింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడాయి. చివరకు సీక్వెల్ మూవీ అంశం తెరపైకి వచ్చిందట. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సూర్య ఈ వార్తలన్నింటికీ ఓ క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తాను చేయబోయే చిత్రం ఖుషీకి సీక్వెల్ కాదని, కొత్త కథతో ఈ చిత్రాన్ని తీయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి రేణు దేశాయ్ నిర్మాతగా ఉంటుందా! లేకా పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మాత అనేది ఇంకా తేలియలేదు.

(Visited 177 times, 1 visits today)