Home / Inspiring Stories / స్కూల్ కి 76 లక్షలు ఇచ్చిన సచిన్ టెండుల్కర్.

స్కూల్ కి 76 లక్షలు ఇచ్చిన సచిన్ టెండుల్కర్.

Author:

అది పశ్చిమ బెంగాల్‌ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్‌ పాఠశాల. ఈ పాఠశాల 50 ఏళ్లనాటిది. దీని చరిత్ర అంత ఇంత కాదు ఎందరో వ్యక్తులకు విద్య బుద్దులు నేర్పి ప్రయోజకకులని చేసి పాఠశాల. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలలో 400 మంది విద్యార్థులు చదువుకోవడమే చాలా ఎక్కువ కానీ ఈ పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అలాంటి గొప్ప పాఠశాల ఇప్పుడు కొన్ని రోజులకు ముందు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో మంది విద్యార్థులకి విద్య బుద్ధులు నేర్పే ఈ పాఠశాలని బాగు చేయడానికి చాలా మంది ప్రభుత్వ అధికారులని, రాజకీయ నాయకులని కలిసాడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యుడు, కాని ఎవరి నుండి ఎలాంటి సయం అందలేదు, ఆఖరికి ఆ ప్రాంతనికి ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభోద్ పాండాని కూడా కలిసి పాఠశాల దుస్థితి గురుంచి వివరించిన కూడా పట్టించుకొలేదట.

Sachin Tendulkar

ఇక అన్ని దారులు మూసుకుంటున్న వేళ ఆ పాఠశాల విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఒక బ్రంహాండమైన ఆలోచన వచ్చింది, తమ పాఠశాల దుస్థితి గురుంచి వివరిస్తూ, తమ పాఠశాలకి ఎలాగైనా సహాయం అందించాలని కోరుతూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి ఒక ఉత్తరం రాసారు, ఆ లెటర్ ని చదివిన వెంటనే సచిన్ టెండూల్కర్ స్పందించాడు, ఆ స్కూల్ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు తన వంతుగా 76 లక్షల రూపాయలని అందించాడు, త్వరలోనే ఆ స్కూల్ లో కొత్త భవనాన్ని కట్టబోతున్నారు.

(Visited 435 times, 1 visits today)