Home / Latest Alajadi / భార్య కోసం వేల కి.మీ సైకిల్ పై యాత్ర చేశాడు.

భార్య కోసం వేల కి.మీ సైకిల్ పై యాత్ర చేశాడు.

Author:

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి పెళ్లి అనే రెండు అక్షరాల పేరుతొ మూడు ముళ్ళు వేసినందుకు తన కన్నవారిని, తోబుట్టువారిని, అలాగే తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదనుకోని ఒక ఆడపిల్ల తనకు తాళి కట్టిన భర్త కోసం వస్తుంది. ఇలా వచ్చిన వారిని చాలా మంది ఎన్నో హింసలకు గురిచేస్తున్నారు. కొందరు బయటికి చెప్పుకుంటారు మరికొందరు బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. ఎదో సమాజ కట్టుబాట్ల కోసం, తమ పిల్లల కోసం సంసారం చేస్తున్న ఈ రోజులలో మతిస్థిమితం సరిగా లేని తన భార్య కోసం ఎన్నో రోజులుగా ఎన్నో ఊర్లు , సైకిల్ పైనే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు తన భార్యను కలుసుకున్నాడు సూరత్ కి చెందిన తాపేశ్వర్. ఇది సినిమా స్టోరీ కాదు రియల్ స్టోరీ. ఎన్నో నెలలుగా వేల కిలోమీటర్లు తిరిగాకా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోని ఓ గుడి ముందు కనిపించిన తన భార్యను చూసి ఇన్ని రోజుల తన కష్టానికి ఫలితం దక్కిందని ఆనందపడ్డాడు.

sahasa-yatra-by-husband-for-his-wife
కరువుకు మారు పేరు అయినా బీహార్ నుండి ఉత్తర్ ప్రదేశ్ కి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తాపేశ్వర్, బబిత దంపతులు. బబిత కు సరిగా మతిస్థిమితం లేదు అయినా చాలా ప్రేమతో చూసుకునేవాడు తాపేశ్వర్. ఒక రోజు తాను కూలీ పనికి వెళ్లి తిరిగొచ్చే సరికి ఇంట్లో బబిత కనిపించలేదు దానితో తాను ఉండే ప్రాంతాల్లో మొత్తం వెతికాడు కాని ఎక్కడ కనిపించలేదు. దానితో తనకున్న  సైకిల్ కి తన ప్రేమనే శక్తిగా మార్చి ఆ చుట్టుపక్కల అన్ని ఊర్లు తిరిగాడు అయినా ఫలితం లేదు దానితో అదే సైకిల్ మీద వెతుకుతూ, వెతుకుతూ ఎక్కడికి చేరుకుంటే అక్కడే ఆ రాత్రి ఆక్కడే పడుకొని మళ్ళీ ఉదయమే సైకిల్ పై ఎక్కేవాడు. ఇలా 8 నెలలు తన భార్య పోస్టర్ ని సైకిల్ పై తగిలించుకొని ప్రతి ఊరిలో అందరిని అడుగుతూ అడుగుతూ ….. చివరికి ఇన్ని నెలల కష్టానికి ఫలితం తన భార్య తనకు ఒక గుడి దగ్గర బిక్షమెత్తుకుంటూ కనిపించింది. భిక్షగత్తెగా తన భార్యను చూసిన క్షణం ఒక్కసారిగా తనకు దుఃఖం పొంగిపొర్లింది. దానికి కారణం తాపేశ్వరం పేదవాడు అయినా ఒక్కరోజు కూడా తన భార్యని పస్తులు ఉంచలేదు అలాగే తను అందంగా లేకపోయినా, మతిస్థిమితం లేకపోయినా కన్నా బిడ్డలా చూసుకున్నాడు….. ఇలా భార్య కోసం దాదాపు మూడు రాష్ట్రాలను మొత్తం తిరిగి చివరకు తన భార్యను వెతికి పెట్టుకున్నాడు. తన భార్య అందంగా లేకపోయినా, మతిస్థిమితి లేకపోయినా తన భార్య మీద ఎంత ప్రేమ ఉందొ తెలుస్తుంది. ఈ భార్య భర్తల స్టోరీ ఇప్పుడు ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఈ భార్య భర్తలు వారికి వచ్చిన కూలీ పని చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. చిన్న మాటలకే, చిన్న అరుపులకే విడాకులు చేసుకుంటున్న చాలా మందికి ఈ దంపతుల కథ ఒక గుణపాఠం.

(Visited 1,583 times, 1 visits today)