Home / Entertainment / రెహమాన్ మ్యూజిక్… మ్యాజిక్.

రెహమాన్ మ్యూజిక్… మ్యాజిక్.

Author:

అక్కినేని నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా నటించిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రనికి గౌతమ్ మీనన్ దర్శకుడు అలాగే సంగీతం ఏ.ఆర్.రెహమాన్‌. ఇది వరకు ఈ ముగ్గిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో ఆడియో అంతకుమించిన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమాతో సిద్ధమైపోయింది. ఇప్పటికే టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకుంది. యుట్యూబ్ లో ఈ చిత్ర మేకింగ్ ఫోటొస్ తో ఈ ఆడియో సాంగ్ ‘వెళ్ళిపోమాకే..’ ను విడుదల చేయగా నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట ‘ఐ’ సినిమాలోని ‘నువ్వుంటే నా జతగా’ పాట మాదిరిగానే ఉంది కొద్దిగా.

పాట రిలీజ్ అయిన సమయం నుండే రెహమాన్ అభిమానులతో పాటు, సంగీత ప్రియులంతా ఈ పాటకు ఫిదా అయిపోయారు. రెహమాన్ అబ్బురపరచే ట్యూన్, ఇన్స్ట్రుమెంట్స్‌తో చేసిన ప్రయోగానికి శ్రీజో సాహిత్యం, సిద్ధ్ శ్రీరామ్, ఏడీకేల గానం తోడై ఈ పాటకు ఒక అందం వచ్చింది. రెండు రోజులుగా ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ కూడా విడుదల కానున్నది.

(Visited 140 times, 1 visits today)