ఈ టైటిల్ చూసి ఏదో ప్రిన్స్ మహేష్ కొత్త సినిమా టైటిల్ అనుకుని పొరబడేరూ..మహేష్ కాదు కానీ మన అక్కినేని నాగ చైతన్య చేస్తున్న సినిమా టైటిల్ ఇది. ఈ టైటిల్ లో ఎంత పొయెట్రీ ఉందో అంతే హీరోయిజమూ ఉంది అందుకే కాబోలు మన క్లాసీ డైరెక్టర్ గౌతం మీనన్ ఈ టైటిల్ ఫిక్స్ అయ్యాడు. నిజానికి పొయిటిక్ టైటిల్స్ పెట్టడంలో గౌతమ్ మీననే టెస్టే వేరు. ఏ మాయ చేశావే, ఎటో వెళ్ళిపోయింది మనస్సు వంటి సినిమాల పేర్లు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. నాగచైతన్యకు తొలి బ్లాక్ బస్టర్ అందించిన గౌతమ్ ఇప్పుడు మనోడితో రెండో సినిమా చేస్తున్నాడు. తెలుగులో చైతూ తమిళంలో శింబులను పెట్టి బైలింగువల్గా చేస్తున్న ఈ రోడ్-యాక్షన్-రొమాన్స్ సినిమాకు ఫైనల్ గా ‘ సాహసం శ్వాసగా సాగిపో సోదరా ‘ టైటిల్ పెట్టారు. అప్పట్లో మహేష్ తొలి బ్లాక్బస్టర్ ‘ఒక్కడు’ సినిమాలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సోదరా అనే పాట నుండి ఇనస్సయిర్ అయి ఈ టైటిల్ పెట్టారు. ఇక ఈ ఏడాదిలో ముందు చైతూ సినిమా, వెంటనే అఖిల్ సినిమా..తరువాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమ..ఇలా అక్కినేని అభిమానులకు వచ్చే మూడు నెలల్లో ట్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వనున్నారు..అక్కినేని ఫాన్స్ కి ఇక పండగ సీజనే..