Home / Entertainment / ట్రైలర్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’తున్న చైతు.

ట్రైలర్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’తున్న చైతు.

Author:

నాగ చైతన్యకు హీరోగా ఒక గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు గౌతమ్‌ మీనన్. వీరిద్దరి కాంభినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘ఏమాయ చేసావె’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంభినేషన్ లో వస్తున్న సినిమా “సాహాసం శ్వాసగా సాగిపో”. ఈ సినిమా ట్రైలర్ కొద్ది క్షణల ముందు రీలీజ్ అయ్యింది.అదిరిపోయే విజువల్స్, స్టైలిష్ మేకింగ్ తో ట్రైలర్ చాలా సూపర్బ్ గా ఉంది, నాగ చైతన్య డిఫరెంట్ లుక్ తో కనిపించాడు, కొత్త హీరోయిన్ మంజిమా మోహన్ కూడా చాలా క్యూట్ గా ఉంది, బాబా సెహగల్ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించి ఆశ్చర్య పరిచాడు.

ఒక అమ్మాయి ప్రేమలో పడిన యువకుడు.. ఏదన్నా జాబ్ టేకప్ చేసేముందు ఒక చిన్న రోడ్ ట్రిప్ వెళ్లొద్దాం అంటాడు. అప్పుడు చైతూ జీవితం స్టార్టవుతుంది. ప్రియురాలు (మంజిమా మోహన్)తో కలసి రోడ్ ట్రిప్ కు వెళ్లే దారిలో.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడమే జీవితం అని ప్రూవ్ చేస్తాడు ఈ కుర్రాడు. ”జీవితంలో చాలా చూశాకే చావడం కష్టం అనిపిస్తుంది. మనం ఏమీ చూడ్లేదు. చచ్చినా పర్లేదు” అనే ఒకే ఒక్క డైలాగుతో మొత్తం సినిమాను చక్కగా సమ్మరైజ్ చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్.

(Visited 594 times, 1 visits today)