Home / Reviews / సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రివ్యూ

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రివ్యూ

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ subhramanayam for sale movie review

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: సాయి ధరం తేజ్, రేజీన , బ్రహ్మానందం

Directed by: హరీష్ శంకర్

Produced by: దిల్ రాజు

Banner: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ .

Music Composed by: మిక్కి జే మేయర్

పిల్లా నువ్వు లేని జీవితం అంటూ తెలుగు తెర పై అడుగుపెట్టిన సాయి ధరం తేజ్ తన మొదటి హీరోయిన్ అయిన రెజినా కసాండ్రా తో చేసిన మూడో ప్రయత్నం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. హరీష్ షంకర్ తన రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తో వచ్చిన నిరాశలోంచి బయటికి రావటానికి చేసిన ప్రయత్నం గా కూడా సినిమాని చెప్పుకోవచ్చు. మరి సుబ్రహ్మణ్యం ని ఈ ఇద్దరూ ఎంత మేరకు సేల్ చేస్తారు మార్కెట్ లో ఎలా నిలబడతారూ అనేది ఇవాల్టితో తెలియనుంది…  గబ్బర్ సింగ్ హిట్ తో మామ పవన్ కళ్యాన్ ని పడేసిన హరీష్ ఇక అల్లుడిని ఎంతవరకూ ఇంప్రెస్ చెస్తాడో అభిమానులని ఎంత సంతోష పెట్టాడో అని చూసిన అభిమానులకు కొంత నిరాశనీ కాస్త ఊరటనీ ఇచ్చాడు హరీష్ భాయ్..

కథ:

హీరో సుబ్రమణ్యానానికి  ఉన్న కొన్ని మనీ ప్రాబ్లంస్ వల్ల ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అమెరికా వెళ్ళి మరీ రేడియో మిర్చీ జాకీగా పని చేస్తూంటాడు. ఎలా ఐనా సరె ఏ పనైనా సరే డబ్బు ఇస్తా అంటే చేసేస్తా అంటాడు. అలా డబ్బు కోసం తనని తాను అమ్ముకుంటూ ఉంటాడన్న మాట మనొడికి ఉన్న అవసరం అలాంటిది మరి. అదే సమయం లో ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోవటానికి  ఇంటినుంచి పారిపోయి వచ్చిన సీత(రెజీన) కలుస్తుంది.అనుకోని పరిస్థితుల్లో  సుబ్రహ్మణ్యం డబ్బు కోసమే ఒక బెస్ట్ కపుల్ షోలో పాల్గొని ఉత్తమ జంటగా డబ్బు గెలుచుకుంటాడు. ఆమెతో కలిసి సీత ఊరైన కర్నూల్ వెళ్ళతాడు. అక్కడ సీత తండ్రితో సీత చెప్పినట్టు ఆమె భర్తగా నాటకం ఆడతాడు. ఐతే అక్కడ రెడ్డప్ప శత్రువైన బుజ్జి(రావు రమేష్) తో సుబ్రహ్మణ్యానికి సమస్యలొస్తాయి అంతే కాదు పాతపగతో  హైదరాబాద్ లోని పాతబస్తీ దాదా అయిన గోవింద్ గౌడ్ (అజయ్) కూడా సుబ్రమణ్యం కోసం వెతుకుతూ ఉంటాడు. గోవింద్ చెల్లెలు దుర్గ (అదాశర్మ)ను పెళ్లి చేసుకోకుండా అమెరికా పారిపోయాడన్న కోపంతో ఉంటాడు గోవింద్. ఎలాగైనా తన చెల్లెలు దుర్గను సుబ్రమణ్యానికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకొంటాడు. సీత కుటుంబంతో కలిసిపోయిన సుబ్రమణ్యం చివరికి సీతను పెళ్లాడాడా? లేక గోవింద గౌడ్ చెల్లెలు అయిన దుర్గని చేసుకున్నాడా? చివరికి ఎవరి ప్రేమ గెలిచింది? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

విశ్లేషణ:

కొన్ని నెలలు గా పెద్ద హైప్ నే క్రియేట్ చేస్తూ మరో సూపర్ హిట్ ఖాయం అన్నట్టు గానే ధైర్యంగా వున్నాడు హరీష్ శంకర్ ఐతే చిరూ పాత సినిమా “భావగారు బాగున్నార” కాన్సెప్ట్ ని కాకుండా కాస్త మారిస్తే ఇంకా బావుండేది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లా వ‌చ్చిన ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్’ ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ చ‌క్క‌గానే హ్యండిల్ చేశాడనే చెప్పొచ్చు. ధరం తేజ్ బాడీ లాంగ్వేజ్ తన మేనమామలయిన  చిరు, ప‌వ‌న్‌లను ఇమిటేట్ చేసినట్టు అనిపించినా పర్లేదనిపించింది. డ్యాన్సులు, ఫైట్స్‌లో ధరం తేజ్ ఫుల్ ఎన‌ర్జీని చూపించాడు. కామెడి టైమింగ్ బావుంది. ఫ‌స్టాఫ్‌లో బ్ర‌హ్మానందం కామెడి బాగానే నవ్వించింది. సెకండాఫ్ వ‌చ్చేస‌రికి ప్ర‌భాస్ శ్రీను, ఫిష్ వెంక‌ట్‌, బ్ర‌హ్మానందంలు కామెడి ప‌ర్సంటేజ్‌ను త‌గ్గ‌కుండా చూడ‌డంలో త‌మ‌ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో బ్ర‌హ్మానందం కామెడి కంటే ఫిష్ వెంక‌ట్ కామెడి బావుంది. ఎవ‌డో యాపిల్ కాయ అని పెట్టుకుంటే న‌మ్ముతారు కానీ నేను అవ‌కాయ అని పెట్టుకుంటే నమ్మ‌రా …అనే డైలాగ్ విపరీతంగా నవ్వించింది… మొత్తం మీద ‘ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ‘ క్లాస్ కంటే మాస్ ఆడియెన్స్‌కి బాగా క‌నెక్ట్ అవుతుంది. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ నుంచి హరీష్ ని గట్టెక్కించటమే కాదు సాయి ధరం తేజ్ కెరీర్ కి కూడా మంచి ప్లస్ ఔతుంది ఈ సినిమా..

 నటీనటుల ప్రతిభ:

సాయి ధరం తేజ్: సాయి యాక్టింగ్ సినిమాకి ప్రధాన ప్ల‌స్ పాయింట్ అయింది. ఫుల్ ఎన‌ర్జీతో సినిమాని చివరి వరకూ మంచి జోష్ మీద న‌డిపించాడు. మంచి పెర్‌ఫార్మెన్స్‌తో పాటు డ్యాన్సులు, యాక్ష‌న్ పార్ట్‌లో కూడా మంచి ఈజ్ తో ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా మావ‌య్య‌లు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను చ‌క్క‌గా ఇమిటేట్ చేశాడు.

రెజీనా: గ్లామ‌ర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా చ‌క్క‌గా న‌టించింది. సెంటిమెంట్ సీన్స్‌లో మంచి న‌ట‌న‌ను ఎలా క‌న‌ప‌రిచిందో అలాగే పాట‌ల్లో గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డింది. మరో ప్లస్ రెజీనా నే అనటం లో ఏ మాత్రం సందేహం అక్కరలేదు..

బ్ర‌హ్మానందం: “చింతకాయ్” బ్ర‌హ్మానందం వంట‌వాడుగా అమెరికాలో, ఇండియాలో చేసిన కామెడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అజ‌య్‌, రావుర‌మేష్‌, న‌రేష్‌, ఝాన్సీ, తేజ‌స్వి, ఫిష్ వెంక‌ట్ త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పని తీరు: కథ పాతదే అయినా మంచి స్క్రీన్ ప్లే తో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తనని తాను నిరూపించుకున్నాడు. సినిమాలో ధరం తేజ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ్ముడు సినిమాలో సాంగ్‌ను ఇమిటేట్ చేయ‌డం, చాలా వ‌ర‌కు స‌న్నివేశాల్లో చిరంజీవిని ఫాలో కావ‌డం వంటి మేన‌రిజ‌మ్స్‌తో ఫ్యాన్స్‌ను ఆక్ట‌టుకునే ప్ర‌య‌త్నం చేయటం ఈ సినిమాకి ప్లస్సె అయినా తర్వాత తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరుచుకోవలసిన అవసత్రం ఉంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం బావుంది. తొలిసారి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి మిక్కి చ‌క్క‌ని మ్యూజిక్ అందించాడు. టైటిల్ సాంగ్‌, తెలుగంటే…, ఏమైందో ఏమో ఓ మై ల‌వ్ … అనే సాంగ్స్‌తో పాటు చిరంజీవి గువ్వా గోరికంతో…రీమిక్స్ సాంగ్స్ మ్యూజిక్‌, చిత్రీక‌ర‌ణ ప్రేక్ష‌క‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ రీమిక్స్ సాంగ్ లోకేష‌న్ కానీ, పిక్చ‌రైజేష‌న్ సూప‌ర్‌. కెమెరావ‌ర్క్ ఆడియన్స్‌కి నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది.
రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తి సీన్‌ను రిచ్‌గా చూపించాడు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్ కంపోజిష‌న్ చాలా బావుంది. సినిమా ఫ‌స్టాఫ్‌లో తొలి ఇరవై నిమిషాలు కొద్దిగా స్లోగా అనిపించినా తర్వాత బావుందనే అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో సెంటిమెంట్ డోస్ కాస్త తగ్గిస్తే బావుండేది. సినిమా క‌థంతా ఎక్క‌డో చూసిన సినిమాల్లోలాగానే క‌న‌ప‌డ‌తాయి. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ అనే టైటిల్‌కి మొద‌టి ఫ‌దిహేను నిమిషాలు మాత్ర‌మే న్యాయం చేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. మిగ‌తాదంతా రోటీన్ ఫార్ములా క‌థ‌లాగానే ఉంటుంది. పెద్ద పెద్ద విల‌న్స్‌ను హీరో ఫూల్ చేయ‌డం అంతా
మ‌న‌కు ఓకేలా క‌న‌ప‌డుతుంది.

ప్లస్ పాయింట్స్:

సాయి ధరం తేజ్,

హరీష్ షంకర్,

రెజినా,

మిక్కీ

మైనస్ పాయింట్స్:

రొటీన్ అతుకులబొంత కథ.

సాగదీసిన క్లైమాక్స్.

విలన్స్ ని మరీ కామెడీగా చూపించడం.

సెకండ్ హాఫ్ ఎడిటింగ్.

మొత్తానికి డ‌బ్బు కోసం దిగుతానేమో కానీ, దిగ‌జారిపోను అనే  “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” మాట మీదే నిలబడ్డాడు..

(Visited 119 times, 1 visits today)