Home / Entertainment / కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను దోచుకున్న అందగత్తెలు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను దోచుకున్న అందగత్తెలు.

Author:

ఆయన ముంబై లోని బాంద్రా క్లబ్ కి రాత్రి పది గంటలవుతుండగా చేరుకున్నాడు. అప్పటికే చాలామంది క్లబ్ లో మందు మత్తు లోకి జారుకుంటున్నారు. అలవాటు ప్రకారం ఆ కండల వీరుడు తన టేబుల్ దగ్గరికెళ్లి కూర్చున్నాడు. ఇంతలో..మత్తెక్కించే పరిమళాన్ని తమ చాలీ చాలని దుస్తులకు స్ప్రే చేసుకున్నఒక నలుగురు భామలు అతడి దగ్గరికొచ్చారు. తమని ఆయన అభిమానులుగా పరిచయం చేసుకున్నారు. వాళ్ళతో బ్రీఫ్ గా అమాట్లాడి..వారి అభిమానాన్ని చూరగొన్న భాయిజాన్…తన గ్లాసెస్, వాలెట్ ఆ టేబుల్ మీదే వదిలిపెట్టి కాస్తంత పక్కకి వెళ్ళాడు.తిరిగి వచ్చి చూసుకునే సరికి అవి కాస్తా హుష్..కాకీ అయిపోయాయి. ఆ ముద్దుగుమ్మలకోసం చూసుకునే సరికి, వారు కూడా మాయమయ్యారు. క్లబ్ సెక్యూరిటీ సిబ్బంది  పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినా కానీ, సల్మాన్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు.

అయితే ..సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అసలు తన అన్న ఈ మధ్య కాలం లో నైట్ క్లబ్ కి వెళ్లనే లేదనీ, అసలతను వాలెట్ క్యారీ చెయ్యడనీ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే దర్శక నిర్మాత నందితా సింగ్గా మాత్రం సల్మాన్ దోపిడీ కి గురైన విషయాన్ని ధృవీకరించింది. సల్మాన్ తన సెక్యూరిటీ ని ఇద్దరి నుంచి 14 మందికి పెంచుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒక ఫిల్మ్ ప్రోమో కోసం శుక్రవారం జూహు లోని ఒక హోటల్ లోకి సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ తో ఎంటర్ అవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాదు….ముంబై నగరంలో ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అంటూ సల్మాన్ అక్కడ చేసిన వ్యాఖ్యలు…బాంద్రా క్లబ్ ఇన్సిడెంట్ ని బహుశా గుర్తు చేసి ఉండవచ్చు! అందగత్తలా……మజాకా !

(Visited 45 times, 1 visits today)