Home / Entertainment / సల్మాన్ పెళ్లి డేట్ ఫిక్స్ !?

సల్మాన్ పెళ్లి డేట్ ఫిక్స్ !?

Author:

salman weds lulia vantur

బ్రహ్మచారిగా ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలలో ముదురు బ్రమ్మచారి సల్మాన్ ఖాన్. ఇప్పటికే 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సల్మాన్ తన తల్లికి ఇచ్చిన మాట కోసం పెళ్ళి చేసుకోనున్నాడు. ఒకప్పుడు బ్యాడ్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకున్న సల్మాన్ చాలా మంది అమ్మాయిలతో ప్రేమాయణం జరిపిన సంగతి తెలిసిందే, ఇప్పుడు చాలా రోజుల నుండి రొమేనియన్‌ బామ అయిన లులియా వంటూర్‌ తో  చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఇక తననే పెళ్లి చేసుకొవాలని నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి తేదీ కూడా ఫిక్సయినట్టు వినిపిస్తోంది. డిసెంబర్ 27, 2016న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని తాజాగా ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది, ఇది ఎంతవరకు నిజం అనేది కొద్ది రోజుల్లో తెలియనున్నాది.

(Visited 1,013 times, 1 visits today)