Home / Entertainment / తల్లి కాబోతున్న సమంత.

తల్లి కాబోతున్న సమంత.

Author:

Samantha Acting in Mother Role

సమంత ఈ పేరు చాలు తెలుగు, తమిళ్ భాషల్లో కుర్రకారు గుండేళ్లో గుర్రాలు పరిగేడుతాయి . కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్, కత్తి సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.

విభిన్నమైన పాత్ర అంటూ ముందు ఉంటుంది సమంత. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని ఆమె నిర్చయించుకుంది. ఈ మేరకు ఆమె రీసెంట్ గా తల్లి పాత్రలో కనిపించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రాజు-రాణి దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమె తల్లిగా కనిపించనుంది. విజయ్, సమంత మధ్య ఉండే అనుబంధం వివరిస్తూ పెళ్లి నుంచి బిడ్డ పుట్టేదాకా ఓ మెలోడియస్ సాంగ్ సైతం ఈ చిత్రం ఉండనున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం మరో హీరోయిన్ మీనా క్యూట్ బేబి నైనిక…ఈ చిత్రంలో ఈ జంటకు పుట్టిన బిడ్డగా కనిపించనుంది. అలాగే ప్రభు,రాధికలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నారు.ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్ ఈ సినిమాతో తొలి సారిగా స్క్రీన్ పై కనిపించనున్నారు. నవంబర్ 26 నుంచి షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

(Visited 107 times, 1 visits today)