Home / Uncategorized / అతడితో నాది ఏడేళ్ల బంధం-సమంత

అతడితో నాది ఏడేళ్ల బంధం-సమంత

Author:

samantha

ఏం మాయ చేశావే.. నాగ చైతన్య – సమంతలు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసేశారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ 2010 ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది. ప్రేమికులుగా నటిస్తూ.. ప్రేక్షకులను కూడా ప్రేమలో ముంచేశారు. ఇది చైతూకు రెండవ సినిమా, మొదటి హిట్. సమంతకు మాత్రం లాంఛింగ్ మూవీ.

నాగ చైతన్య – సమంతలు ఆ సినిమా నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.అయితే ఆ మద్యలో ఒక టివీ చనల్ లో ఎవరితో చేసేందుకు మీకు కంఫర్టబుల్ అని అడిగితే సమంత టక్కుమని ఇచ్చే సమాధానం చైతూ. మొదటి సినిమా నుంచి ఉన్న స్నేహంతోనే ఇలా చెప్పిందనే విషయం అర్ధమవుతుంది. తర్వాత కూడా నాగచైతన్యతో కలిసి సినిమాలు చేసింది సమత. ఇప్పుడు తామిద్దరం కలిసి నటించిన మొదటి మూవీ ఏ మాయ చేశావో షూటింగ్ కోసం.. వీరు కలిసి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది ఈ అందల సుందరి .

“నాగచైతన్యతో కలిసి కెరీర్ లో ఎదిగిన అనుభూతి కలుగుతోంది. ఏడేళ్లుగా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది” అంట సమంత ట్వీట్ చేసింది. “కాలం మారినా కొన్ని విషయాలు మాత్రం మారవు సమంతా” అంటూ చైతీ ట్వీట్ చేయడం విశేషం..

(Visited 117 times, 1 visits today)