Home / Entertainment / రికార్డ్ సృష్టించిన సమంత

రికార్డ్ సృష్టించిన సమంత

Author:

Samantha twitter followers croseed 2 million

సమంత సినిమా పరిశ్రమకు వస్తూనే ఏ మాయ చేసిందో కాని తన అందానికి, నటనకు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు. తన క్యూట్ లుక్స్ తో హీరోల గుండెల్లో సహితం తిష్ట వేసి నిదురలేని రాత్రులను చేసింది. సమంత ఇటు తెలుగులో అటు తమిళ్ లో టాప్ హీరోలందరితో స్టెప్ లేసి టాప్ హీరోహిన్ అయ్యి అవార్డ్ తో పాటు రివార్డ్స్ కూడా సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త మైలు రాయిని దాటింది. ఈ సుందరి అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉండటానికి ట్విట్టర్ ఖాతని తెరిచిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు అదే ట్విటర్లో ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఈ అందాల ముద్దుగుమ్మ ట్విటర్లో 2 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేసి తన స్టామిన ఎంటో తెలియజేసింది. సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో ట్విట్టర్ లో ఇప్పటి వరకు 2 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ చేసిన హీరోయిన్స్ ఇద్దరే, వారే శృతి హాసన్(3.4 మిలియన్ ఫాలోవర్స్), త్రిష(2.4మిలయన్ ఫాలోవర్స్). ఇప్పుడు వీరి తర్వాత 2 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ని సాధించిన మూడవ సౌత్ హీరోయిన్ గా సమంత ఓ రికార్డ్ ని సృష్టించింది.

(Visited 152 times, 1 visits today)