Home / Entertainment / బిగ్‌బాస్ నుండి సంపూ ఔట్…! షో మీద విమర్శలు…!

బిగ్‌బాస్ నుండి సంపూ ఔట్…! షో మీద విమర్శలు…!

Author:

హహహ… అందరూ సంపూర్ణేష్ బాబును తక్కువగా అంచనా వేశారు… కానీ తను ఈ బిగ్‌బాస్ షో ఎంత బక్వాసో అందరికన్నా ముందే బాగా అర్థం చేసుకున్నాడు… థూ… దీనెమ్మ జీవితం అనుకుని… ఒరేయ్, మీరు పంపిస్తారా..? నన్ను తాళాలు బద్దలు గొట్టుకుని వెళ్లిపోమంటారా..? అన్నట్టుగా తిరగబడ్డాడు… పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేశాడు… అరెరె, ఇదేమిటోయ్… నీ కాంట్రాక్టు, కథా, మాటేమిటి అని బిగ్‌బాస్ అడిగితే… మీ తొక్కలో రూల్స్, నేను బయటికిపోతాను అంటూ ఎదురు తిరిగాడు… చేసేదేముంది..? బిగ్‌బాస్ నీ ఇష్టం, వెళ్లిపో అన్నాడు… దొరికిందిరా విముక్తి అనుకుని సంపూ మరుక్షణం బయటపడిపోయాడు… కంగ్రాట్స్ సంపూర్ణేష్… ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి బయటపడ్డందుకు కంగ్రాట్స్… సో, మొత్తం 14 మందికి హౌజ్ ‌మేట్స్‌కు గాను మిగిలింది ఇక 12 మంది… జస్ట్, 9 రోజులకే…! అన్నట్టు, తెలుగు తప్ప ఇంకేమీ మాట్లాడొద్దు అన్న రూల్‌ను… పోరా, నీయెంకమ్మా అని ఉల్లంఘించే ముమైత్ బాగానే ఉంది… వెళ్లిపోవాలీ, వీళ్లు అవసరమే లేదు అని అందరూ మూకుమ్మడిగా వోట్లేసిన మహేష్ కత్తి, మధుప్రియ బాగానే ఉన్నారు… ఫ్లోర్ ఊడ్వటం తప్ప ఇంకేమీ చేయని కత్తి కార్తీక బాాగానే ఉంది… ఫోజులు కొట్టడం తప్ప ఇంకే పనీ చేతకాని ప్రిన్స్, ఆదర్శ్, ధనరాజ్ బాగానే ఉన్నారు… పాపం, సంపూ మాత్రం వెళ్లిపోయాడు…

బిగ్ బాస్ బిగ్‌బాస్

ఇంగ్లిషుతోపాటు అనేకానేక భాషల్లో ఎంతో కొంత హిట్టయిన ఈ షో తెలుగులో మాత్రం స్క్రిప్టు, ప్లానింగు వైఫల్యాలతో ‘అమృతాంజన్ షో’ అని పేరు తెచ్చుకుంది… ఎందుకు..? అది అర్థం కావాలంటే 9వరోజు షో చూస్తే చాలు… ఇదెంత దరిద్రంగా వెళ్తున్నదో అర్థమైపోతుంది… పాపం, జూనియర్ ఒక్కడే దీన్ని పట్టాల మీదకు ఎక్కించాలని మొన్న వీకెండ్‌లో ఎంత ప్రయత్నించినా… కథలో దమ్ము లేకపోతే తనేం చేస్తాడు పాపం..? ఏదో వేటగాళ్లు, తాళాలు, బందీలు, వేట, జంతువులు అనే ఓ పిచ్చి కాన్సెప్టు ప్రవేశపెట్టారు… చూస్తున్నవాళ్లందరికీ అడవిలో తిరిగే ఆగమాగం బతుకే అయిపోయింది… ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, అసలు ఆ కాన్సెప్టు ఏమిటో అర్థం గాక ప్రేక్షకుల తలలు గిర్రున తిరిగిపోయాయి… ఇక పార్టిసిపెంట్ల గతేమిటో పాపం… అన్నట్టు శివబాలాజీ, సమీర్ రేపు ఏదో తలతిక్క కాన్సెప్టుతో, స్క్రిప్టు బేస్‌డ్ తగవు పడతారట… అది భరించాలంటే టైగర్ బామ్ కూడా సరిపోదేమో…!!

Post Credits : Muchata

(Visited 7,013 times, 1 visits today)