Home / Entertainment / ఈ బాలీవుడ్ హీరో రెమ్యున రేషన్ 450 రూపాయలు.

ఈ బాలీవుడ్ హీరో రెమ్యున రేషన్ 450 రూపాయలు.

Author:

sanjay dutt released from jail

చేసిన పాపానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. పుట్టుకతోనే ఒక బాలీవుడ్ స్టార్ కొడుకతను. స్వతహాగా తానూ బాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదిగాడు. దేశం మొత్తం అభిమానించే నటుడిగా “ఖల్ నాయక్” (రేపటి రారాజు) అనిపించుకున్న ఆ హీరో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనీ, ముంబై లో జరిగిన పేళుళ్ళ కేసుతో అతనికి సంబందాలున్నాయన్న ఆరోపనలు రావటంతో, ఒక్క సారిగా దేశం మొత్తం విస్తు పోయింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌ను దోషిగా నిర్ధారిస్తూ 2013 మార్చి 21వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్రమంగా 9 ఎంఎం పిస్టల్‌ను, ఎకె – 56 రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నందుకు సంజయ్ దత్‌ను టాడా కోర్టు దోషిగా నిర్ధారించింది. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికిపైగా గాయపడ్డారు.

అయితే విచారణ నిమిత్తం కస్టడీలో ఉన్న సంజయ్ అప్పటికే 18 నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. తీర్పు తర్వాత మిగతా కాలాన్ని కూడా పూర్తిచేసుకున్న సంజయ్ పుణె ఎరవాడ జైలు నుంచి గురువారం(2016/2/25) విడుదల కానున్నాడు. ఈ సందర్బంగా సంజయ్ దత్కు జైలు అధికారులు 450 రూపాయలు అందజేయనున్నారు. ఇది బహుమతిగా కాదు, అతని పనికి వారు చెల్లించే కూలీ..

ఇన్నాళ్లు ఖైదీగా జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసిన సంజయ్, రోజుకు 50 రూపాయల చొప్పున రూ. 38,000 వరకు సంపాదించాడు. సెమీ స్కిల్డ్ వర్కర్’ కింద పరిగణించి, అతడితో పేపర్ బ్యాగులు తయారు చేయించారు. ఇందుకు అతడికి రోజువారీ కూలీ కూడా ఇచ్చారు. సాధారణంగా జైల్లో ఒకరోజు పనిచేస్తే ఖైదీలకు రూ.35 చెల్లిస్తారు. దీనిని 2015, సెప్టెంబర్ 1 నుంచి రూ.50కి పెంచారు. అయితే జైల్లో తన అవసరాల నిమిత్తం చాలా వరకు ఖర్చు చేయటంతో విడుదల సమయంలో కేవలం రూ. 450 మాత్రం అతని చేతికి రానున్నాయి.

కోట్ల రూపాయల మద్య పుట్టి పెరిగిన బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన సంజయ్ జీవితం ఎన్ని మలుపులో తిరిగి అతన్ని రోజుకి 35 రూపాయల కూలీని చేసింది. తప్పు చేసిన ప్రతీవారూ ఎప్పుడో ఒకప్పుడు శిక్షింపబడక మానరు. అన్న మాటలు ఈ ఖల్ నాయక్ జీవితం లో నిజమయ్యాయి. ఇకముందైనా సంజయ్ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడని ఆశిద్దాం…

(Visited 229 times, 1 visits today)