Home / Entertainment / గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరైనోడు ఫస్ట్‌లుక్‌.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరైనోడు ఫస్ట్‌లుక్‌.

Author:

Sarainodu First Look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరిని హ్యాపీ చేయ్యడానికి దేశ ముదురు అవతరం ఎత్తాడు తర్వాత మనిషిలో మరో వేదం కూడా ఉంటుందని చూపిస్తు బద్రినాథ్ లా మారీపోయాడు, ఇలాగే ఉంటే ట్రేడ్ సెట్ కాదని జులాయి గా, ఇద్దరమ్మాయిలతో ఆడి పాడి, రేసుగుర్రం లా తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారడు.

ఇప్పుడు అందరి చేతా సరైనోడు అనిపించేందుకు వస్తున్నాడు. అయితే బన్నీ తన కొత్త సినిమా సరైనోడు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నట్లు సంకేతాలిచ్చి చివరకు సంక్రాంతికి ఎలాంటి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు మరోవారం రోజుల్లో సరైనోడు టీమ్ ఫస్ట్‌లుక్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. భోయపాటి శీను దర్శకత్వంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్, కాథరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు చిన్నపాటి టీజర్ కూడా విడుదల కానుందని సమాచారం. ఇక సంక్రాంతికి ఫస్ట్‌లుక్ రాలేదని బాధ పడ్డ అభిమానులు ఇప్పుడు మరోవారం రోజుల్లో తమ సినిమా ఫస్ట్‌లుక్ రానుందని తెలియడంతో మళ్ళీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

(Visited 187 times, 1 visits today)