Home / Entertainment / మార్చి 12న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలు.

మార్చి 12న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలు.

Author:

Sardaar Gabbar Singh Audio Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన గబ్బర్ సింగ్ సినిమాలోని అదే పవర్ఫుల్ పోలీస్ పాత్రని మరోసారి రిపీట్ చేస్తూ చేస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ‘పవర్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తన స్నేహితుడైన శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే, లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం అడియోని మార్చి 12న గ్రాడ్ గా రిలిజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు..

‘సర్దార్ గబ్బర్ సింగ్’ మొదటి షెడ్యూల్ గుజరాత్ లో కంప్లీట్ చేసుకోని జనవరి 5 నుంచి ఈ సినిమా మిగత షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. పవన్ కళ్యాణ్ సంక్రాంతికి కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. కంటిన్యూగా 29 రోజులు జరగాల్సిన షెడ్యూల్ కి ఇప్పుడు పవన్ ఓ చిన్న బ్రేక్ ఇచ్చాడు.

అలా గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కాస్త టైం సెపరేట్ గా గడపడం కోసం సింగపూర్ వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజులు రిలాక్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి రానున్నాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి సర్దార్ షెడ్యూల్ ని రీ స్టార్ట్ చేయనున్నాడు.

(Visited 1,148 times, 1 visits today)