Home / Entertainment / అభిమానుల అంచనాలు రెట్టింపు చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ టీజర్ .

అభిమానుల అంచనాలు రెట్టింపు చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ టీజర్ .

Author:

Sardaar-gabbar-sing-audio-teaser

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసిన టీమ్, ఆడియో రిలీజ్‌‌తో ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చేందుకు సిద్దం అవుతుంది. చిత్ర టీం, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనెల 20న హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఇక అదే రోజున థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల కోసం గత కొద్ది నిమిషాల క్రితం ఆడియో టీజర్ విడుదల చేసారు. ఈ సాంగ్ టీజర్ తో చిత్రం పై ఉన్నఅంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫ్యాన్స్ ని సంతోష పెట్టడంలో పవర్ స్టార్ ఎప్పుడు ముందే ఉంటాడని అని మరోసారి నిరూపించాడు.

ఇక ఈ సినిమా యొక్క ట్రైలర్‌ను ఈమధ్యే కట్ చేసి ఇండస్ట్రీలోని కొద్దిమంది ప్రముఖులకు ప్రదర్శించారట. ఈ ప్రదర్శనలో ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాలో అభిమానులు కోరే అన్ని అంశాలూ ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేసిందని సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఫన్ డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో కట్టిపడేసే అంశాలుగా నిలుస్తాయని తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కానున్న ఈ వేడుక కోసం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

(Visited 1,801 times, 1 visits today)