Home / Entertainment / వేసవిలో సెగ పుట్టించనున్న సర్దార్.

వేసవిలో సెగ పుట్టించనున్న సర్దార్.

Author:

Sardaar Gabbar Singh Release Details

సిల్వర్ స్క్రీన్ బ్లాస్ట్ కి సర్దార్ రెడీ అయిపోతున్నాడు. కొత్తరకం గన్స్ తో మాస్ పోలీస్ ఇప్పటికి 60% పనులన్నీ పూర్తి చేసేసుకొని సిద్దమైపోయాడు. ఇక తాజాగా జరగున్న భారీ షెడ్యూల్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తైనట్టే. అందుకే భారీ షెడ్యూల్స్ కోసం గుజరాత్ వెళ్లి అక్కడ లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని పోలీస్ స్టేషన్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ సందడి చేస్తున్నాడు.

ఇక పవన్ సినిమాలకు గుడ్ బై చెపుతురాన్న ప్రచారం జరుగుతూందటంతో సర్దార్ ఓపెనింగ్స్ పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఈ పాయింట్ ని కావాలనే హైలెట్ చేస్తున్నట్టు కూడా సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. . చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయిన్ మరొకరికి లేదు. జనసేన పార్టీతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ 2017 నుంచి వెండితెరకు గుడ్ బై చెప్పనున్నారు అని టాక్.రైతు భవిష్యత్ నే ఏ జెండా గా తీసుకొని పవన్ ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే పవన్ ‘సర్దార్ ‘ త్వరగా పూర్తి చేసి పని లో పడ్డాడట..అంతే కాదు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయేలోపు ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం ఫై  అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సినిమాల బిజీలో పడి పాలిటిక్స్‌‌కు టైం కేటాయించలేకపోతున్నానంటూ కొన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ జనం మధ్యకి వెళ్ళటం ద్వారా ప్రజలకి దగ్గర కావటం వల్ల పార్టీ పై నమ్మకం తగ్గిపోయే ప్రమాదం ఉందని పవన్ అభిప్రాయ పడుతున్నారట. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం

ఇప్పటి నుంచి పొలిటికల్ బరిలో జనసేన పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పవన్ ఉద్దేశ్యం. అలా చేస్తేనే 2019 ఎన్నికల  నాటికి బలమైన జనసేనను నిర్మించవచ్చన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారట. ఈ నెల 15 లోపు ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి, తరువాత చిత్ర టీం గుజరాత్ వెళ్లనుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండాలి?, అలాగే అడియో ఫంక్షన్ ఎప్పుడు జరపాలి? వంటి విషయాలపై డేట్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో చిత్ర టీం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. వేసవి లో సెగ పుట్టించటానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సింగ్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

(Visited 82 times, 1 visits today)