త్వరలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న పవర్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ లో లక్ష్మీ రాయ్ ఒక ప్రత్యేక గీతం లో నర్తించనుందట. ఈ సినిమాలో పవన్ పక్కన చిందులేయనుందట ఈ అందాల బెంగాలీ పిల్ల. పవన్ కి తాను పెద్ద ఫ్యాన్ ని అనీ ఆయన పక్కన స్క్రీన్ మీద కనబడటం తనకెంతో ఆనందంగా ఉందని ఉబ్బి తబ్బిబ్బౌతోంది లక్ష్మీ రాయ్ . హిందీ సినిమా దబంగ్ కి రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆ సినిమాలో కెవ్వుకేక పాటా ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ పాటని గబ్బర్ సింగ్ లో ఉన్న “కెవ్వు కేక” అంత పాపులర్ అయ్యేలా ఉండాలనుకుంటున్నారట ఈ చిత్ర దర్శకుడు బాబీ.
ఎక్కడా రాజీ పడకుండా మాంచి మసాలా పాటని సిద్దం చేయిస్తున్నారట. గబ్బర్ సింగ్ కి ఏ మాత్రం పోల్చటానికి వీలు లేకుండా పూర్తిగా కొత్త కథనం తో సర్దార్ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా. కొత్త పద్దతిలో ప్రజెంట్ చేయబోతున్నారట. ఐతే ఈ తెల్ల అందాల బక్కపల్చ బ్యూటీ ఒక్క పాట వరకేనా లేక సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రా అన్నది మాత్రం ఇంకా తెలియటం లేదు.
ఇప్పటికే ఈ సినిమాలో పవన్ పక్కన హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది.ఐతే ఈ కొత్త గబ్బర్ కాజల్ తో సరిపెట్టు కుంటాడా లేక లక్ష్మీ రాయ్ కి కూడా సగం స్క్రీన్ పై చోటిస్తాడా..!? ఇంకా తెలియలేదు. ఐతే లక్ష్మీ రాయ్ అదృష్టానికి కుళ్ళుకుంటున్నారట. మిగిలిన ఐటం భామలు. ఇప్పటికే రిలీజ్ ఐన టీజర్లో పవన్ లుక్ అదిరిపోయొఇందంటున్నారు జనాలు. మరి పక్కన ఇలాంటి అందాల భామలు కూడా తోడైతె ఇంక చెప్పేదేముందీ. బాక్సాఫీస్ కొత్త రికార్డులకి సిద్దమైపోయినట్టే.