Home / Entertainment / హిందీలో సవాల్ విసురనున్న “సర్దార్”

హిందీలో సవాల్ విసురనున్న “సర్దార్”

Author:

Sardar-Gabbar-Singh-Hindi-version-poster

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు ‘సర్దార్ గబ్బర్ సింగ్’. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాత పూర్తిస్థాయి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ రోల్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంనే కామెడీ పండిస్తాడట!. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచేస్తూ పోతున్నాయి. ఈ సమ్మర్ మన ముందుకు పండగల ఏప్రిల్ 8న గ్రాండ్‌గా వస్తున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్, ఈ సినిమా ఇప్పుడు ఒక్క తెలుగులోనే కాక హిందీలోనూ అదే రోజు విడుదల కానుందంటూ ఓ తాజా సమాచారం.’సర్దార్ గబ్బర్ సింగ్‌’ వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఎరోస్ సంస్థ, ఈ సినిమాను హిందీలోకి కూడా డబ్ చేసి విడుదల చేస్తోంది. సుమారు 800 థియేటర్లలో సర్దార్ విడుదలవుతుందని ఎరోస్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు అది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

(Visited 200 times, 1 visits today)