Home / Entertainment / ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్”.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్”.

Author:

Sardaar Gabbar Singh Audio Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా నటిస్తోన్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో బుల్లెట్ లా దూసుకోచ్చే డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు పవన్, ముఖ్యంగా ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ చాలా బాగా పేలింది. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా ఏ మాత్రం గబ్బర్ సింగ్ సినిమాకు తక్కువ కాకుండ డైలాగ్స్ ఉన్నాయని వినికిడి అందులో ” మీ లాంటి బందిపొట్లకి..లెక్కతో చెప్తే తలాకెక్కదురా..అందుకే నా తిక్కతో చెప్పాలని ఒచ్చ..” ఇలాంటివి చాలా ఉన్నాయని వినికిడి.

ఈ సినిమా ఏప్రిల్ నెల 8వ తేదిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోతోంది. ఇక విడుదలకు ఇంకా రెండు నెలలు ఉండగానే బిజినెస్ పరంగా ‘సర్దార్’ అన్నిచోట్లా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ, పంపిణీదారి సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్, సర్దార్ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇక ఎరోస్ సంస్థకి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కుల అమ్మాకానికి అన్నిచోట్లా అద్భుతమైన ఆఫర్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో ఎరోస్ స్వయంగా సినిమాను విడుదల చేస్తుండగా నైజం ఏరియాలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

Area Price
Ceeded Rs 10.70 crore
Vizag Rs 7.20 crore
G East Rs 6.20 crore
G West Rs 4.60 crore
Guntur Rs 6.5 crore
Krishna Rs 4.25 crore
Nellore Rs 3.25 crore
Total Rs 42.7 crore

నైజం ఏరియలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్ ని రికార్డ్ రేట్ కి ఐన కొనేందుకు పంపిణిదారులు వెనుకాడట్లేరు, నైజం రేటు 15-20 కోట్ల మధ్య ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు,ఒకవేళ నైజంలో 15 కోట్లకి అమ్ముడైన కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 58 కోట్ల బిజినెస్ జరుగుతుంది,మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన శ్రీమంతుడు సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 57 కోట్లకి అమ్మారు, కాని సర్దార్ గబ్బర్ సింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 58 కోట్ల బిజినెస్ చేసినట్లు అవుతుంది, ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ చూసినట్లయితే 75 కోట్ల కి పైగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి,’సర్దార్ గబ్బర్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ లోను కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు,సినిమా విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

(Visited 465 times, 1 visits today)