Home / Entertainment / ‘సర్దార్’ సెట్లో నవ్వుల సందడి.

‘సర్దార్’ సెట్లో నవ్వుల సందడి.

Author:

Sardaar Gabbar Singh Rights Nijam

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్న వాటిలో లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఒకటి. ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమా కంటే పెద్ద హిట్ కావలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి నుండే ఈ సినిమాకు అన్ని విదాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టోరి పరంగా,క్యాస్టింగ్ పరంగా, కామిడి పరంగా ఇలా అన్ని విదాల ప్రేక్షకుల కోరికని తీర్చేలా ఈ సినిమాని ఫస్ట్ సమ్మర్ రిలీజ్ గా ఏప్రిల్ 8న సినిమాని రిలీజ్ చేయనున్న ఈ చిత్రాన్ని జోరుగా షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది ఈ చిత్ర టీం. ఇటీవలే కేరళ వెళ్ళోచ్చిన ఈ చిత్ర టీం ఇప్పుడు హైదరబాద్ లో తదుపరి షెడ్యూల్ ని మొదలు పెట్టారు.

ప్రస్తుతం సర్దార్ సెట్ అంతా నవ్వుల మయమైంది. ఎందుకంటే ప్రస్తుతం సర్దార్ షూట్ లో భాగంగా సినిమాలోని కొన్ని కామెడీ పార్ట్స్ ని షూట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కన్నా మించి ఈ సినిమాలో కామెడీ ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒక్కోక్క కమిడియన్స్ ఈ మధ్యా సోషల్ మీడియాలో పవన్ తో దిగిన ఫోటోస్ అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఈ విదంగా చూస్తే ఈ సినిమాలో గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ కామెడీ ఉన్నాట్టు తెలుస్తుంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. కాజల్, లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ఎరోస్ వారు వరల్డ్ వైడ్ రైట్స్ కొనుక్కొని అన్ని ఏరియాల బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు.

(Visited 362 times, 1 visits today)