Home / Entertainment / “సర్దార్” రికార్డ్ రిలీజ్ కి నైజాం రెడీ

“సర్దార్” రికార్డ్ రిలీజ్ కి నైజాం రెడీ

Author:

sardaargabbarsingh new poster

అత్తారింటికి దారేది తర్వాత సోలో హీరోగా పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ హీరోయిన్, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అలాగే ‘పవర్’ సినిమా  ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్, పవర్ స్టార్ ఇద్దరు సంయుక్తంగా నిర్మించారు.సర్దార్ గబ్బర్ సింగ్ భారీ అంచనాల నడుమ రేపే మన ముందుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ముఖ్యంగా నైజాం ఏరియాలో సుమారు 384 థియేటర్లలో విడుదల కానుంది. అంటే అర్దం చేసుకోవచ్చు ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో…

           పవర్ స్టార్ సినిమాని తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఎందుకంటే మన తెలుగు మార్కెట్ విస్తృతి పెంచడంతో పాటు ఒక మంచి సినిమాను అందరికి చేరువయ్యేలా చేయడం జరుగుతుంది. అయితే ఈ సినిమా ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ప్రభంజనమే సృష్టిస్తుందని టాక్.

(Visited 421 times, 1 visits today)