Home / Political / ముఖ్యమంత్రి పీఠం కాదు, కటకటాల వెనుకకు శశికళ.

ముఖ్యమంత్రి పీఠం కాదు, కటకటాల వెనుకకు శశికళ.

Author:

తమిళనాడు ముఖ్యమంత్రి కావలనుకున్నశశికళ ఆశలకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న శశికళను ఆక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించింది. అంతే కాకుండా ఆమేకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించి త్వరగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. జయలలిత మృతి తరువాత తమిళ రాజకీయాలలో ముసలం మొదలయ్యింది. పన్నీర్ సెల్వం రాజీనామా తరువాత ముఖ్యమంత్రి పీఠం అందరూ శశికళదే అనుకున్నారు. కాని రాజీనామా చేసినట్టే చేసిన పన్నీర్ సెల్వం ఒకటెసారి మాట మార్చడంతో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపై స్పష్టత కరువైయ్యింది.

Sasikala

ఇంతకుముందు జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సుప్రీం తీర్పుతో శశికళ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. అక్రమాస్తుల కేసులో జయలలిత ప్రధాన నిందితురాలు కాగా, సహనిందితులుగా శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ ఉన్నారు. ఈ తీర్పు కొరకే వేచి చూస్తున్న గవర్నర్‌ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పన్నీర్‌ సెల్వం బృందం సంబరాలు చేసుకుంటున్నారు.

(Visited 1,803 times, 1 visits today)