Home / Entertainment / కట్టప్ప కాస్తా దొర గా మారిపోయాడు.

కట్టప్ప కాస్తా దొర గా మారిపోయాడు.

Author:

Kattappa Bahubali

మిర్చి తో టాలివుడ్ తేర పై కనిపించి ఆ తర్వాత పూజ, తుంగభద్ర,రాజా రాణి తర్వాత “బాహుబలి” చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ కి ఎంతపేరు తీసుకోచ్చిందో అందుకు ఏ మాత్రం తగ్గకుండా ‘కట్టప్ప’ పాత్రలో నటించిన సత్యరాజ్ కి కూడా ఆ చిత్రం అంతే క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ బాహుబలి చిత్రం తర్వాత సత్యరాజ్ తెలుగులో త్వరలో ‘దొర’గా కనిపించబోతున్నాడు. తన కుమారుడు శిభిరాజ్, బిందు మాధవి జంటగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘జాక్సనదురై’ చిత్రాన్ని తెలుగులో ‘దొర’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ దొర మరియు దెయ్యం పాత్రల్లో కనిపించనున్నాడు.

ధరణి ధరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రత్న సెల్యులాయిడ్ పతాకంపై జవహర్ బాబు నిర్మిస్తున్నారు. ఒక పీరియాడికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేసాడు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కి కూడా అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళంలో జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి చిత్రంలో యుద్ధాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన కట్టప్ప..ఈ చిత్రంలో దెయ్యంగా ఎంతవరకు భయపెట్టగలుగుతాడో వేచి చూడాల్సిందే..!!

(Visited 110 times, 1 visits today)