Home / Entertainment / సావిత్రి కోసం కండలు పెంచిన నారా రోహిత్….!

సావిత్రి కోసం కండలు పెంచిన నారా రోహిత్….!

Author:

తెలుగు ఇండస్ట్రీలో తన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్న నారా రోహిత్ గ్యాప్ లేకుండా కష్ట పడుతున్నాడు తన సినిమాలను శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం “అసుర” గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోహిత్ మాస్ హీరో గా కూడా తనేంటో నిరూపించుకునే ప్రయత్నాలనూ చేస్తున్నాడు. మొన్నటి వరకూ శంకర కోసం షూటింగ్ లో ఉన్న రోహిత్.ఇప్పుడు ‘శంకర’ విడుదలకు సిద్ధమయింది.ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్  సావిత్రిని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళే ప్రయత్నాల్లో పడ్డాడు.”పండగలా వచ్చాడు”,”అప్పట్లో ఒకడుండేవాడు” వంటి వైవిధ్యమైన టైటిల్స్ తో రూపొందే చిత్రాల లోనూ రోహిత్ నటిస్తున్నాడు.జూలై లోనే సావిత్రి ఫస్ట్ లూక్ ని రిలీజ్ చేసిన రోహిత్ ఇక ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు పావులు కదుపుతున్నాడు. కథ కోసం తన బాడీని సిద్దం చేసే పనిలో పడ్డాడు, ఫ్యామిలీ స్టోరీ నే అయినా సూపర్ యాక్షన్ చిత్రంగా కూడా నిలవబోయే ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ లో కనిపించటానికి కష్ట పడుతున్నాడు. ఈ చిత్రానికి ప్రేమ ఇష్క్ కాదల్ వంటి ప్రేమ కథా చిత్రంతో సక్సెస్ సాధించిన పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు.

సావిత్రి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది.నారా రోహిత్ సరసన నందిత రాజ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని కంటిన్యూగా షూట్ చేసి 3 నెలల్లో షూటింగ్ తో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఓ థ్రిల్లర్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా కూడా ఉండేలా ప్లాన్ చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. పవన్ సాధినేనితో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య డైలాగ్స్ అందిస్తుంటే, శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

(Visited 65 times, 1 visits today)