Home / Entertainment / సావిత్రి సినిమా రివ్యూ & రేటింగ్.

సావిత్రి సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Savitri Movie Perfect review and Rating

గ‌త నెల‌లో తుంట‌రితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించిన రోహిత్ ఈ రోజు సావిత్రితో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. రోహిత్ స‌ర‌స‌న తెలుగ‌మ్మాయి నందిత హీరోయిన్‌గా న‌టించిన ఈ సావిత్రి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో చూద్దాం.

కథ :

ఎప్పుడూ పెళ్లి గురించే ఆలోచిస్తుంటుంది దొర‌బాబు (మురళీశర్మ) రెండో కూతురు సావిత్రి (నందిత). ఆమెకు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అన్న ఆలోచ‌న త‌ప్ప వేరే ధ్యాస ఉండ‌దు. సావిత్రికి ఎట్ట‌కేల‌కు పెళ్లి కుదురుతుంది. పెళ్లి కుదిరిన సంద‌ర్భంలో మొక్కులు తీర్చుకోవ‌డానికి సావిత్రి షీర్డీ వెళుతుండ‌గా ఆమెను ట్రైన్‌లో చూసి ప్రేమించేస్తాడు మ‌న హీరో రిషి (నారా రోహిత్‌). రిషి సావిత్రి వెంట‌పడుతుండ‌డంతో మ‌నోడిపై ఫైర్ అవుతుంది. ఇంత‌లో స‌డెన్ ట్విస్ట్ పెళ్లి కొడుకు మ‌రో అమ్మాయితో ల‌వ్‌లో ఉన్నాన‌ని సావిత్రితో పెళ్లి ఇష్టం లేద‌ని చెప్పేస్తాడు. వెంట‌నే సావిత్రికి ఇంట్లో మరో పెళ్లి కుదురుస్తారు. సావిత్రి ప్రేమ కోసం రిషి వాళ్ల ఊర్లో దిగుతాడు ? అప్పుడే స‌డెన్ ట్విస్టులు ఎంట్రీ ఇస్తాయి. అస‌లు సావిత్రితో పెళ్లి కుదిరిన ఫ‌స్ట్ పెళ్లి కొడుకు ఎవ‌రిని ప్రేమించాడు ? సావిత్రి రిషిని ప్రేమించిందా? ఎవర్ని పెళ్లి చేసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

అలజడి విశ్లేషణ:

దర్శకుడు పవన్ సాధినేని హీరోయిన్ కు పెళ్లంటే ఇష్టం అన్న పాయింట్ తో మొదలు పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకోడానికి 20 ఏళ్లుగా ఓ విలన్ రెడీగా చేసుకుని.. ఆమెకు ఓ ప్రయణంలో అనుకోకుండా ఓ హీరోని పరిచయం చేసి ఇలా రకరకాలుగా కన్ ఫ్యూజ్ చేస్తూ ఆడియెన్స్ క్లారిటీ మిస్ అయ్యేలా చేశాడు. ఒక లైన్ రాసుకుని దానికి బలమైన డైలాగులు రాసుకున్నాడు కాని ఆ బలమైన మాటలకు తగ్గ సన్నివేశాలు రాయడంలో విఫలమయ్యాడు. మొదటి భాగం మొత్తం హీరో హీరోయిన్ ని చూడటం ఆమె ను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఓ ప్రేమ జంటను కలపడం అంతా కాస్త బోర్ కొడుతుంది. మధ్యలో పోసాని ఎపిసోడ్ ప్రేక్షకులకు అంతగా నవ్వులు పండించదు కాదు కదా విసుగు తెప్పిస్తుంది. ఇక ఎలాగోలా హీరోయిన్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటే ఆమె మాత్రం సారీ అనేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం కోసమే హీరోకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడం కాని మనోడి సావిత్రి ప్రేమలో ఉండి డైరెక్ట్ గా అమ్మాయి నాన్నకే పెళ్లి చూపులు క్యాన్సిల్ అనేస్తాడు. తీరా అది సావిత్రి అని తెలియడం అక్కడకెళ్లి సారీ చెప్పాలనుకోవడం ఇదంతా లాగింగ్ గా అనిపిస్తుంది.

ఇక రవిబాబు 20 సంవత్సరాల పగని చివరగా హీరో కొట్టడానికి వస్తే సిల్లీగా మాట్లాడటం అసలు బాగా అనిపించదు. సినిమా పాయింట్ ఇది అని కచ్చితంగా దర్శకుడికే ఓ కచ్చితమైన ఉన్నా దాన్ని ప్రేక్షకులకు చేరువేయడంలో విఫలమయ్యాడు. నారా రోహిత్ ఇలాంటి చేసిన ఈ సావిత్రి ప్రయత్నం పర్వాలేదనిపించినా ఇంకా తన డైలాగ్ మాడ్యులేషన్ లో మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంది. ఇక నందిత తన పాత్ర వరకు ఓకే కాని అక్కడక్కడ డీ గ్లామరస్ గా కనిపించి చిరాకు తెప్పిస్తుంది. మొత్తానికి సావిత్రి అని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్, నందితల సినిమా కేవలం డైలాగ్స్ మాత్రమే బలంగా రాసుకుని సినిమా కథ కథనాల మీద ఎటువంటి శ్రద్ధ పెట్టని సినిమా అనొచ్చు. మరి బోర్ కొడుతుంటే ఏదో టైం పాస్ కు ఓ సినిమా చూద్దాం అనుకునే వారికి సావిత్రి నచ్చే అవకాశం ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు:

‘సావిత్రి’కి సాంకేతిక నిపుణులు పెద్ద బలంగా నిలిచారు. శ్రావణ్ సంగీతం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతంతో సినిమా అంతా ఒక ఫీల్ తో సాగిపోయేలా చేశాడు శ్రావణ్. పాటలు కూడా బాగున్నాయి. సావిత్రి థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. వసంత్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు ముఖ్య ఆకర్షణ. సినిమాకు కలర్ ఫుల్ లుక్ ఇచ్చాడు వసంత్. ద్వితీయార్ధంలో.. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. నిర్మాణ విలువలకూ ఢోకా లేదు. కృష్ణచైతన్య ప్రథమార్ధంలో లైవ్లీగా ఉండేలా డైలాగ్స్ రాశాడు. అలాగే ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్స్ లోనూ వాటికి తగ్గ మాటలతో ఆకట్టుకున్నాడు. ‘‘వద్దనుకుంటే ఒక నిమిషం. కానీ కావాలనుకుంటే ఒక జీవితం’’.. ‘‘మీ ప్రేమ ఖర్చులో కనిపిస్తోంది. నా ప్రేమ వాళ్లను కొట్టడంలో కనిపిస్తోంది’’.. లాంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.ఇక సినిమాకు ఎడిటింగ్ చేసిన గౌతం నెరుసు మరింత కత్తెరలు వేయాల్సి ఉంది.

ఇక పవన్ సాధినేని దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్టయ్యేలా సినిమాను తీర్చిదిద్ది.. ఈ ట్రెండుకు సరిపోయే దర్శకుడనిపించుకున్నాడు పవన్. అతడి దర్శకత్వ శైలి ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను మలచడంలో పవన్ ప్రతిభను ‘సావిత్రి’ బాగానే ఎలివేట్ చేసింది.

ఫ్ల‌స్ పాయింట్స్:

  • కొత్త ల‌వ్ ట్రాక్‌
  • ఎమోష‌న‌ల్ సీన్లు
  • రోహిత్‌-నందిత కెమిస్ర్టీ
  • నిర్మాణ విలువ‌లు
  • ర‌న్ టైం

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ హాఫ్
  • ఎంటర్టైన్మెంట్

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్: “హిట్ కోసం రోహిత్, రోహిత్ కోసం సావిత్రి

(Visited 1,173 times, 1 visits today)