Home / Entertainment / నారా రోహిత్ ‘సావిత్రి’ చిత్ర టీజర్ విడుదల.

నారా రోహిత్ ‘సావిత్రి’ చిత్ర టీజర్ విడుదల.

Author:

నారా రోహిత్ రాజకీయ కుటుంబం నుండి సినిమా రంగనికి వచ్చిన తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.‘బాణం’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘అసుర’ చిత్రం వరకు విభిన్న చిత్రాల్లో నటీంచాడు. తెలుగులో ప్రస్తుతం రోహిత్ చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే హీరో చేతిలో లేవు. తన చేతిలో సుమారు అర డజన్ సినిమాలు వరుసగా ఉన్నాయి. అందులో పండగలా వచ్చాడు,శంకర, రాజా చేయ్యివేస్తే,మద్రసి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నారా రోహిత్ ‘సావిత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నారా రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం తాజాగా ‘సావిత్రి’ చిత్ర టీజర్ ని విడుదల చేసింది.

విజన్ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై వి.బి రాజేంద్రప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రనికి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ లో రోహిత్ మునుపటి చిత్రాల కన్నా ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ఈ టిజర్లో రోహిత్, నందిత ఫన్నీ డైలాగులతో అదరగొట్టారు. మార్చి 25న ‘సావిత్రి’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇటీవలే ప్రకటించింది.

(Visited 239 times, 1 visits today)