Home / General / మొదలైన SBI ఛార్జీల మోత!!!

మొదలైన SBI ఛార్జీల మోత!!!

Author:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటినుండో ఎదురు చూస్తున్న జూన్ ఒకటి రానే వచ్చింది. నేటినుండి SBI కస్టమర్లకు ఛార్జీల మోత మోగనుండి. ఇన్నాళ్ళు ఉచితంగా అందిస్తున్న సర్వీసులకు ఈరోజు నుండి (జూన్ 1) ఛార్జీలు వసూలు చేస్తామని ఇంతకుముందే ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). మరి ఏయే సేవలకు ఎంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారో క్రింద చదవండి.

sib bank new charges

1) ఇన్నాళ్ళు సొంత బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళి ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా నిర్వహొంచుకునే వెసులుబాటు ఇక మీదట లేదు. బ్యాంక్ కు వెళ్లి జరిపే తొలి నాలుగు లావాదేవీలు ఉచితం, ఆ తర్వాత జరిపే ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ.50 సేవా పన్ను వసూలు చేయనున్నారు. ఇక మీదట అవసరమున్నప్పుడల్లా రోజు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు వేసి తీస్తూ ఉంటే ఈ అదనపు ఛార్జీలతో మీ జేబు గుల్ల అవడం ఖాయం.

2) ఇంతకుముందు లాగే SBI బ్యాంకు ఏటీఎం ల నుండి 5 ఉచిత ట్రాన్సాక్షన్ లు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కి రూ. పది చొప్పున వసూలు చేస్తారు. కాని ఇతర బ్యాంకు ఏటీఎం లు అయితే ఉచితంగా 3 ట్రాన్సాక్షన్ కు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కి రూ.20 వసూలు చేస్తారు.

3) ఈరోజు నుండి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల ఛార్జీలు కూడా పెరగనున్నాయి. IMPS, UPI, IUSSD ద్వారా లక్ష రూపాయల లోపు డబ్బు ఇతరులకు పంపాలంటే ఇంతకుముంది ఉన్న ఛార్జీకి అదనంగా ఐదు రూపాయలు చెల్లించాలి. లక్ష నుంచి రెండు లక్షల రూపాయల మధ్య ట్రాన్సాక్షన్ కు రూ.15, రెండు నుంచి ఐదు లక్షల మధ్య లావాదేవీలపై అదనంగా రూ.25 ఛార్జీలు పెంచింది SBI బ్యాంకు.

4) వీటితో పాటు ఇతర కార్డు సర్వీసులు, పాత నోట్లను మార్చుకునే సదుపాయాలు వాడుకున్నా అదనంగా డబ్బులు కట్టాల్సిందే. ఇకనుండి మన ప్రభుత్వ బ్యాంకుకి వెల్తున్నప్పడు ఈ ఛార్జీల కొరకు కొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్ళండి.

(Visited 3,008 times, 1 visits today)