Home / Latest Alajadi / 63 మంది మొండి బకాయిలని మాఫీ చేసిన SBI ..! వాటిలో విజయ్ మాల్యా ఎగ్గొట్టినవి 1200 కోట్లు..!

63 మంది మొండి బకాయిలని మాఫీ చేసిన SBI ..! వాటిలో విజయ్ మాల్యా ఎగ్గొట్టినవి 1200 కోట్లు..!

Author:

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా బ్యాంకుల ముందు గంటలు గంటలు నిలబడి పడిగాపులు కాస్తున్నారు, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఎలాగోలా బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్న కూడా తిరిగి తీసుకోవడానికి పరిమితులు పెట్టడంతో చాలా స్వల్ప మొత్తంలో మాత్రమే తీసుకోగలుగుతున్నారు, బ్యాంక్, ఏటీఎం ల నుండి డబ్బులని డ్రా చేసుకోవడానికి గంటలు గంటలు క్యూలో నిల్చోవాల్సి వస్తున్న దేశ భవిష్యత్ కోసం ఓపికగా ప్రజలంతా ఈ కష్టాలని భరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

SBI write off 7016 crores debt

డీఎన్ ఏ పత్రిక కథనం ప్రకారం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు వేల కోట్లు రుణాలుగా తీసుకోని చెల్లించని మొండి బకాయిలని రద్దు చేసారు, విజయ్ మాల్యా లాంటి మొండి బకాయిలు ఎప్పటికి రావని వారి అప్పులని మాఫీ చేస్తునట్లుగా ప్రకటించారు, ఈ నిర్ణయం పై దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తాము తమ డబ్బు తీసుకోవడానికి వెళ్తేనే గంటలుగంటలు వెయిట్ చేయాల్సి వస్తోందని.. ఒకసారి తీసుకుంటే మళ్లీ తీసుకోకుండా వేలికి సిరా చుక్క పెట్టుకోవాల్సి వస్తోందని.. కానీ మా డబ్బుతో మాల్యాకు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు, రైతులు 20 వేల రుణాన్ని చెల్లించకపోతేనే వారి ఇంటిని వేలం వేస్తారు కానీ వేల కోట్లు రుణాలని ఎగ్గొట్టి విదేశాలకి చెక్కేస్తున్న వారికీ మాత్రం రుణాల్ని మాఫీ చేసి వారికీ సహాయం చేస్తున్నారు ప్రజలు అంటున్నారు.

sbi-writes-off-rs-7-016-crore-loans-owed-by-wilful-defaulters

విజయ్ మాల్యా  నుండి బ్యాంకులకి రావాల్సిన 1201 కోట్ల రుణాలను మాఫీ చేయగా.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు మొత్తం 7016 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఇలా రద్దు చేసినవాటిలో మాల్యాదే పెద్ద వాటా. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన విక్టరీ ఎలక్ర్టికల్స్.. పారామౌంట్ ఎయిర్ వేస్.. కేఆర్ ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులు.. ఘన్ శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జ్యూయల్స్ – యాక్సిస్ స్ట్రక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వంటి సంస్థలున్నాయి. తెలంగాణకు చెందిన ఎస్ ఎస్ వీజీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. టోటెమ్ ఇన్ఫ్రా వంటివి ఉన్నాయి. మొత్తం లిస్టులో మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్సు 1201 కోట్లతో టాప్ లో ఉంది.

(Visited 5,814 times, 1 visits today)