Home / Latest Alajadi / చేతితో తినడం వల్ల కలిగే లాభాలు..! దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురుంచి తెలుసుకోండి.

చేతితో తినడం వల్ల కలిగే లాభాలు..! దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురుంచి తెలుసుకోండి.

Author:

ఈ రోజుల్లో ఇంట్లో అయినా బయట ఏదైనా హోటల్లో ఏదైనా తినాలి అంటే చేతిలో స్పూన్స్, ఫోర్క్ లు ఉండవలసిందే. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఇలానే చేస్తున్నారు. ఇదేమిటి అంటే ప్రాశ్చాత్య సంస్కృతీ అంటారు.. … సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన మన దేశాన్ని చూసి ఇతర దేశాలు మన ఆచార వ్యవహారాలను పాటిస్తుంటే, మనదేశం వారు పక్క దేశాల ఆచారవ్యావహారాలను పాటిస్తున్నారు.

మన దేశంలో ప్రతి పని వెనుక మన పూర్వికులు ఒక నిబద్దమైన విషయాన్నీ ఉహించి చేశారు. ఆ పని వలన జరిగే మంచి అందరికి ఉపయోగపడేలా చేశారు. అలాగే కొన్ని పనుల వెనుక అద్భుతమైన సైన్స్ దాగి ఉంటుంది… ఆపని చేయడం వలన సైటిఫిక్ లాభాలు మనకు చేరుతాయి.మనం భోజనం స్పూన్స్ తో, ఫోర్క్ తో కాకుండా చేతితో చేయడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఇవి చదివిన తరువాత అయిన చేతితో తినడం మొదలు పెట్టండి.

science-behind-eating-with-hands

చేతితో తినడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్:

  • చేతితో ఆహారంగా తీసుకోవడం వలన మన శరీరంలోని నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి.
  • చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది.
  • చేతికి ఆహరం తాకగానే, ఆహరం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతమిస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి భాగా పెరుగుతుంది.
  • చేతివేళ్ళతో ఆహరం తీసుకోవడం వలన, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.
  • చేత్తో ఆహరం తీసుకోవడం వలన ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
  • చేతితో ఆహరం తీసుకోవడంతో మనకు ఎంత ఆహరం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుంది.
  • మన భారతీయ వంటలలో ఎక్కువగా నూనెను ఉపయోగిస్తారు. ఎక్కువ నూనె తో తయారు చేసిన ఆహారాన్ని స్పూన్స్ తో, ఫోర్స్ తో తినడం వలన ప్రతి చర్య జరిగి రుచిపోతుందట..
  • అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమీనియం స్పూన్స్ తో వేడి పదార్థాలు తినడం వలన ఆ వేడికి కొద్దిగా కరుగుతాయి. ఇలా కరిగిన అవి ఆహారంతో మన పొట్టలోకి చేరుతాయి .
  • ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్ లలో కాకుండా రాగి పళ్లంలో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

పురాణాల ప్రకారం మన చేతికి ఉండే ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వాన్ని కలిగిఉంటాయి.

  • బొటనవేలు – అగ్నితత్వం
  • చూపుడువేలు – వాయుతత్వం
  • మధ్య వేళలు – ఆకాశం
  • ఉంగరపు వేలు – భూమి
  • చిటికెన వేలు – జలతత్వం

ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలి జీవశక్తి ఉత్తేజితం అయ్యేట్టు చేస్తాయి…

(Visited 5,195 times, 1 visits today)