Home / health / పెద్దవాళ్ల కాళ్లకు దండం పెట్టడం ఆచారం కాదు ఒక అద్బుతమైన ఆలోచన

పెద్దవాళ్ల కాళ్లకు దండం పెట్టడం ఆచారం కాదు ఒక అద్బుతమైన ఆలోచన

Author:

ఏదైన శుభకార్యం జరిగినప్పుడు, ఎక్కడికైనా  దూరప్రాంతాలకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం  మన సాంప్రదాయంలో చెప్పుకోదగ్గ విషయం. కాని, అది కొందరికి చూస్తుంటే చాలా సిల్లిగా అనిపిస్తుంది కానీ, చాలా మందికి దాని వెనుక ఉన్న విషయం మాత్రం తెలియదు. ఇది సాంప్రదాయం కాదు సైన్స్ అని ఎంత మందికి తెలుసు?

scientific-reason-behind-touching-elders-feet

మనం ముందుగా ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైందో చూద్దాం… శాస్త్రాలా ప్రకారం హైందవ పవిత్ర గ్రందమైన మహాభారతంలోని, అధర్వణ వేదంలో దీని గురించి చాలా వివరంగా వివరించారు. మహాభారతంలో యుధిష్ఠిరుడు పాదాలకు నమస్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించారట.
ఇక పెద్దలకు నమస్కరించడం వలన చాలా లాభాలు ఉన్నాయట. మానవ శరీరంలో పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ల పాదాలు టచ్ చేస్తామో… అప్పుడు వారిలోని పాజిటివ్ ఎనర్జీ వాళ్ల పాదాలు, చేతుల ద్వారా ఎవరైతే నమస్కరిస్తారో వాళ్లకు అందుతుంది. పెద్దవాళ్లు ఎవరైతే మన తలపై చేయి పెట్టి ఆశీర్వదించినప్పుడు వాళ్ల ద్వారా పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవహిస్తుంది. ఇలా చేయడం ద్వారా నమస్కరించే వారికి మంచి వ్యాయామం అవుతుందట. ఎందుకంటే మనం ఎప్పుడైతే వంగుతామో అప్పడు మన నడుము వంచుతాం కద! అప్పుడు ఒక నడుము మాత్రమే కాదు శరీరం మొత్తం వంగుతుంది దానీతో శరీరానికి మొత్తానికి వ్యాయామం అవుతుంది. చూశారా! మన పూర్వికులు ఏ పని చేసిన దాని వెనుక ఒక అద్బుతమైన అర్దం ఉంటుంది.

Must Read: తులసి మొక్క వెనుక ఉన్న అధ్బుతమైన సైన్స్ గురుంచి తెలుసుకోండి. A

(Visited 6,183 times, 1 visits today)