Home / Entertainment / రెండో ప్రపంచ యుద్దం నాటి నిజమైన వెపన్స్ తో కంచె

రెండో ప్రపంచ యుద్దం నాటి నిజమైన వెపన్స్ తో కంచె

Author:
తొలి అడుగే  ముకుంద లాంటి లోకల్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ . పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని అతని రెండో సినిమా చూస్తేనే అర్థం ఔతొంది. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న క్రిష్ దర్షకత్వం లో వస్తున్న  రెండవ సినిమా ‘కంచె’ తో వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ సినిమాని చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సినిమా ట్రైలర్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది.  ఈ ట్రైలర్ లో చూపిన విజువల్స్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ కి అద్బుతమైన  రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో చూపిన 2వ ప్రపంచ యుద్దం  ఎపిసోడ్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ట్రైలర్ అద్బుతం అనిపించింది అని కితాబిచ్చాడు. అసలు రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి కథ ని ప్లాన్ చేసుకోవటమే ఒక సాహసం అని చెప్పాలి. స్వతంత్రానినికి ముందు ఉన్న పరిస్థితులనీ అదీ అప్పటి యుద్ద వాతావరణన్ని చూపించటం అంటే ఆర్ట్ డైరెక్టర్, డైరెక్టర్, కాస్ట్యూం డిజైనర్ పడే శ్రమ అంతా ఇంతా కాదు. పైకి కనిపించకుండా ఇంకా ఎన్నో శాఖల పని మామూలుగా ఉండదు. తర్వాత నటీ నటుల బాడీ లాంగ్వేజ్ కూడా అప్పటి కాలానికి సరిపోయేట్టు గా ఉండాలి. ఇన్ని టాస్క్ లని పెద్దగా అనుభవం రాని నటీ నటులతో చేయటం ఒక సాహసమే. కానీ ట్రైలర్ చూసినపుడు మాత్రం ఈ సినిమా అన్ని సమస్యలని దాటిందనే అనిపిస్తోంది. వరుణ్ తేజ్ పెర్ఫర్మెన్స్ కూడా బాగా ఉందనీ సినిమా రిలీజయ్యాక వరుణ్ నటన వెలుగులోకి వస్తుందని అటున్నారు కంచె యూనిట్ సభ్యులు.
సినిమాలో వరల్డ్ వార్  నేపధ్యాన్ని ఎంచుకోవడమే కాకుండా , వార్ ఏపిసోడ్స్ లో  అప్పట్లో వాడిన రియల్ వెపన్స్ ని కూడా ఇందులో వాడాము అనీ అవి సినిమాకి ఎంతో రియలిస్టిక్ ఫీల్ ని తెప్పించాయనీ చెప్పిన వరుణ్ తేజ్ . అందరి దృష్టినీ ఈ సినిమా వైపే తిప్పుకున్నాడు. అంతే కాకుండా సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే క్రిష్ ఓ మాజీ ఆర్మీ సోల్జర్ ని ని తీసుకువచ్చి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారట. స్వయంగా తనే సెట్లో ఉండి మరీ  అన్ని వార్ ఎపిసోడ్స్ ని తనక్కావలసిన విధంగా వచ్చే వరకూ ఎక్క్కడ రాజీ పడలేదట. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదొక అద్బుతమైన అవకాశం అనీ, అతని పర్ఫార్మెన్స్ ని పూర్తి స్థాయిలో నిరూపించుకోవటానికి సరైన పాత్ర దొరకటం వరుణ్ కి చాలా హెల్ప్ అవుతుందనీ అంటున్నారు విశ్లేషకులు.
                                   సెప్టెంబర్ 12న గ్రాండ్ గా ఆడియోని రిలీజ్ చేసి, అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నరు.
(Visited 119 times, 1 visits today)