Home / Inspiring Stories / సీక్రెట్ ఏజెంట్ షాడో కోసం భారత న్యూక్లియర్ సైంటిస్టుల వెతుకులాట!

సీక్రెట్ ఏజెంట్ షాడో కోసం భారత న్యూక్లియర్ సైంటిస్టుల వెతుకులాట!

Author:

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆద్వర్యంలో ని వివిధ విభాగాల్లో పనిచేసే -సైంటిస్టుల వరుస మరణాల వెనుక సి.ఐ.ఏ. హస్తం ఉందా? గడిచిన పదేళ్లుగా భారతీయ అణు శాస్త్రవేత్తలకు బ్యాడ్ పీరియడ్ నడుస్తోందా? ఆత్మహత్యలా? కుట్రలా? కుతంత్రాలా? అంతుచిక్కని మరణాలా? ..ఇందులో వేటికీ సరైన సమాధానం దొరకడం లేదు. ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే….ఈ శాస్త్రవేత్తల మరణాల వెనుక ఉన్న మిస్టరీల గురించి ఏ మీడియా కూడా వరుస కథనాలు కాదు కదా…కనీసం సింగిల్ కాలం వార్తలు కూడా దినపత్రికల్లో కానరావడం లేదు. ఈ ఏడాది మొదటి నుంచి జరిగిన సంఘటనలు చూస్తే…..కె కె జోష్, అభీష్ శివం అనే ఇద్దరు హై-ర్యాంకింగ్ ఇంజనీర్లు రైల్వే ట్రాక్ మీద విగతజీవులై పది ఉండటం…ట్రాక్ రిపేర్ చేసే కార్మికులు గుర్తించారు. ఆశ్చర్యకరం గా వారి మృతదేహాలపైన ఎలాంటి గాయాలు లేవు. అంచేత వారు రైలు కింద పడి మరణించారనుకోవటానికీ వీలు లేదు. అంతర్గత దర్యాప్తు లో తేలిన విషయమేమిటంటే ….వారి మీద విషప్రయోగం జరగటం..మరి ఈ సంచలనాలు ఎందుకు మీడియాలో రిపోర్ట్ కావటం లేదు. ఇంకా …కొంచెం ముందుకు వెళితే....కొన్ని మీడియాల్లో వీటిని ఆత్మహత్యలుగానూ….లేదా హఠాత్తుగా చోటు చేసుకున్న ప్రమాదాలుగానూ పేర్కొంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆ ఇద్దరు సైంటిస్టుల మరణాలను యాదృచ్చికంగా జరిగిన సంఘటన గా పేర్కొనడం కూడా చాలా సందేహాలు రేకెత్తించింది.

2009 జూన్ లో చోటు చేసుకున్న లోకనాథన్ మహాలింగం అనే న్యూక్లియర్ సైంటిస్టు సందేహాస్పద మరణాన్ని కూడా భారతీయ మీడియా పెద్దగా హైలెట్ చేయలేదు. పైగా, అదొక సాధారణ ఆత్మహత్య కేసు అన్నట్టు వార్తా కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. భారతీయ మీడియా ..ప్రత్యేకించి సైంటిస్టుల మరణాలను అండర్ ప్లే చేయటం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నత స్థాయి ఒత్తిళ్ళు ఉన్నాయా ? అనే ప్రశ్నలతో అప్పట్లో విదేశీ పత్రికలు వరుస వెంబడి కథనాలు ప్రచురించాయి కూడా.

అయిదేళ్లకు ముందు..సరిగ్గా మహాలింగం మృతదేహం దొరికిన ప్రాంతంలోనే….మన దేశానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ( ఎన్ పి సి) లో ఎక్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న ఒక సీనియర్ అధికారిని కిడ్నాప్ చేయటానికి, ఒక సాయుధ దుండగుల గుంపు ప్రయత్నించింది. అతి కష్టం మీద ఆయన ఆ దుండగుల బారి నుంచి తప్పించుకోగలిగారు.

ఎన్ పి సి కే చెందిన మరొక సీనియర్ ఉద్యోగి రవి మూలే కూడా అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. సీనియర్ ఆఫీసర్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కొద్ది రోజుల వ్యవధిలోనే, రవి మూలే హత్యకు గురైనప్పటికీ..పోలీసు లు ఆ కేసు పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేకపోయారని రవి మూలే కుటుంబ సభ్యులే వాపోయారు.

సరిగ్గా రెండేళ్ల వ్యవధి తర్వాత, 2011 ఏప్రిల్ మాసం లో మాజీ సైంటిస్ట్ ఉమారావు మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైనప్పుడు కూడా ప్రభుత్వ, పోలీసు శాఖ ల నుంచి ఇదే రకమైన ఉదాసీనత! ప్రాధమిక దర్యాప్తులో తేల్చిందేమిటంటే…ఉమా రావు ఆత్మహత్య చేసుకున్నారని. కానీ, ఉమారావు కుటుంబ సభ్యులు మాత్రం దర్యాప్తు అదికారుల వాదనను కొట్టిపారేశారు.

ఈ కేసులన్నిటిపైనా సునిశిత వార్తా కథనాలు అందించిన మాధవ్ నలపట్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పరిశోధనలో మాత్రం సైంటిస్టుల మరణాలన్నీ ఆత్మహత్యలు కాదని తేలింది. ఒత్తిడి వల్లో, డిప్రెషన్ వల్లో ఆత్మహత్యలు చేసుకునేంత బలహీన స్థితిలో అయితే సైంటిస్టులు లేరనీ, పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా చెబుతున్న నలుగురు సైంటిస్టుల మృతదేహాలు కూడా రైల్వే ట్రాక్ ల మీదో, ట్రాక్ లకు సమీపంలోని అటవీ ప్రాంతంలోనో దొరకటం పలు సందేహాలకు తావిస్తోందనీ చెపుతున్నారు.

ఈ సందేహాస్పద మరణాల విషయం పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా తలెత్తుతున్న సందేహమేమిటంటే …..2013 లో ముంబై తీరం లో ఐ ఎన్ ఎస్ సింధు రక్షక్ అనే సబ్ మెరైన్ లో జరిగిన పేలుళ్లు కాకతాళీయం కాదనీ, దాని వెనుక సి ఐ ఏ హస్తముందనీ కూడా వార్తలు వచ్చాయి. భారత్ లోని వివిధ న్యూక్లియర్ ప్రాజెక్టులల్లో పని చేస్తున్న పలువురు సైంటిస్టులు …ఎందుకు గడిచిన పదేళ్లుగా టార్గెట్ అవుతున్నారేనే దానిపైన విస్తారంగా అయితే చర్చ జరగాల్సి ఉంది. న్యూక్లియర్ సైన్స్

రంగంలో ఇప్పుడిప్పుడే ఖ్యాతి శిఖరాలను అందుకుంటున్న భారత్ ను ప్రస్తుతం వేధిస్తున్న సమస్య..సైంటిస్టుల అంటూ చిక్కని సందేహాస్పద మరణాలు.  ఇరాన్ లో కూడా ఇదే తరహాలో న్యూక్లియర్ సైంటిస్టుల మీద మాగ్నెటిక్ బాంబు దాడులు జరిగిన తర్వాత, ఆ దేశ ప్రభుత్వం ఎలర్ట్ అయింది. కానీ, భారత రక్షణ శాఖ యంత్రాంగంలో కానీ, ఇంటెలిజెన్స్ యంత్రాంగం లో కానీ ఇంతవరకూ ఎలాంటి కడలికా లేకపోవడం దురదృష్టకరం.. సీక్రెట్ ఏజెంట్ షాడో పేరిట లోగడ తెలుగు లో వెలువడిన మధుబాబు సిరీస్ నవలలు చదివిన ఒక సామాన్య పాఠకుడి కి వచ్చే సందేహాలు కూడా పోలీసులకు, దర్యాప్తు సంస్థల అధికారులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ల అధిపతులకు , భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికార యంత్రాంగానికీ ఇప్పటికీ రాకపోవడం ఇప్పుడు యావత్ భారత జాతి సందేహించాల్సిన విషయం. నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజర్ గా అజిత్ దోవల్ నియామకం తర్వాతైనా …ఈ సైంటిస్టుల మరణాల వెనుక చిక్కుముడి వీడుతుందనే నమ్మకం కలగకపోవడం, న్యూక్లియర్ సైంటిస్టుల్లో ఆందోళన కలిగిస్తోంది. సో……ఇప్పుడు వారి చూపంతా ..మధుబాబు నవలల్లోని సీక్రెట్ ఏజెంట్ షాడో లాంటి ఒక మెరిక లాంటి ఆఫీసర్ వచ్చి, సైంటిస్టుల ను ఆపదల నుంచి రక్షిస్తాడని! బహుశా..అజిత్ దోవల్ ప్రస్తుతం షాడో ని వెతికి పట్టుకునే పని లో ఉండి ఉండవచ్చు! లెటజ్ హోప్ ద బెస్ట్ !

(Visited 346 times, 1 visits today)