Home / Entertainment / ఫేస్ బుక్ నుంచి డైరెక్ట్ గా ఫ్రేమ్ లోకి వచ్చింది.

ఫేస్ బుక్ నుంచి డైరెక్ట్ గా ఫ్రేమ్ లోకి వచ్చింది.

Author:

Aarthana

హ్యాట్రిక్ హిట్స్తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నహీరో రాజ్ తరుణ్, ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగులో అతికొద్ది మందికే సాధ్యమైన రికార్డ్ ని కెరీర్ మొదట్లోనే అందుకున్న హీరో రాజ్ తరుణ్ నుంచి వస్తున్న తదుపరి సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ సినిమాలో టాలెంటెడ్ డైరెక్టర్ ఎన్.శంకర్ రాజ్ తరుణ్ కి ఫాదర్ పాత్రలో కనిపిస్తాడు. ఆర్తన బిను హీరోయిన్ గా పరిచయం కానుంది.శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. జనవరి 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది.

ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా హీరోయిన్ ఆర్తన మాట్లాడతూ …పలు ప్రయత్నాల తర్వాత చాలా మందికి హీరోయిన్ ఆఫర్స్ వస్తుంటాయి కానీ నాకు మాత్రం ఫేస్ బుక్ ద్వారా ఆఫర్ వచ్చింది అంటోంది. ఇంకా తను మాట్లాడుతూ ‘తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లోని ఫోటోలని చూసి ఈ చిత్ర టీం నన్ను అప్రోచ్ అయ్యారు. నేను సినిమాల్లో ఎంటర్ అవ్వడానికి ఆసక్తిగా ఉండడంతో ఓకే చెప్పాను. కానీ నా మీదే సినిమా జరిగే లాంటి పాత్రలకి కెరీర్ మొదట్లో న్యాయం చేయలనేమో అని కాస్త భయం ఉండేది కానీ కథ విన్నాక చేయగలను అనే నమ్మకం వచ్చి ఈ సినిమా చేసానని’ అంటోంది. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు.

(Visited 118 times, 1 visits today)